కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా.

కులాంతర వివాహాలు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండిలా.

.

ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం. స్వచ్ఛమైన ప్రేమ.. కులాలకు, మతాలకు అతీతంగా ఉంటుంది. అందుకే చాలామంది యువత కులాంతర వివాహాలే చేసుకుంటున్నారు. ఇక ఇలా కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారికి ప్రభుత్వం అండగా నిలిస్తూ.. కుల రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇంటర్‌కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న జంటలందరికి రూ.2.50 లక్షల నజరానా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో రూ.50 వేలు ఉన్న ఈ ఆర్ధిక సాయాన్ని ఐదు రేట్లు పెంచి రూ.2.50 లక్షలు చేసింది. దీని కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
వేర్వేరు కులాలకు చెందిన యువతీయువకులు పెళ్లి చేసుకుంటే.. వివాహానికి సంబంధించిన ఆధారాలతో వారు స్థానిక జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తును అధికారులు పరిశీలించి.. అర్హులైన జంటల గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. దీనితో ప్రభుత్వం తక్షణమే జంటలు దరఖాస్తుకు జతపరిచిన బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు జమ చేస్తారు.
దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్…

✍️వివాహం చేసుకున్న వధూవరులవి మూడు ఫోటోలు

✍️ఇద్దరివి కుల ధృవీకరణ పత్రాలు

✍️స్కూల్ టీసీ, పదో తరగతి మార్క్స్ మెమో

✍️వివాహ ధృవీకరణ పత్రం

✍️వివాహం చేసుకున్న జంట జాయింట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్

✍️వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు

✍️ఆదాయ ధ్రువీకరణ పత్రం

✍️ఆధార్‌ కార్డు

✍️రేషన్‌ కార్డు

పవర్‌గ్రిడ్‌లో 114 ఖాళీలు

నాగ్‌పుర్‌లోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన వెస్ట్రన్‌ రీజియన్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 • అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 114
  విభాగాలు: అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌), డిప్లొమా(ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌),డిప్లొమా(ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేట్‌(సివిల్‌, ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌).
  అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
  దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 14, 2020.
  వెబ్‌సైట్‌: https://www.powergridindia.com

అప్రెంటిస్‌షిప్‌ ఐఓసీఎల్‌లో 100 ఖాళీలు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 100
అప్రెంటిస్‌ల వారీగా ఖాళీలు: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌-52, ట్రేడ్‌ అప్రెంటిస్‌-48.
విభాగాలు: మెకానికల్‌, ఎల‌్రక్టికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎల‌్రక్టానిక్స్‌ మెకానిక్‌, ఎల‌్రక్టీషియన్‌ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తుకు చివరి తేది: జులై 21, 2020.
వెబ్‌సైట్‌: https://www.iocl.com/