తెలంగాణ సామాజిక,సాంస్కృతిక లక్షణాలు

సామాజిక , సాంస్కృతిక లక్షణాలు

తెలంగాణ సమాజం చారిత్రకంగా పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు కాస్త భిన్నమైన్నదనే చెప్పవచ్చు . ఎందుకంటే భౌగోలికంగా ఇది పిటభుమికి చెందినది . మరియు పలానాపరముగా ఇది నిజాం పరిపాలన లో ఉండేది తద్వారా తెలంగాణా దాదాపు ప్రత్యేక ప్రాంతముగా కొనసాగింది కాబట్టి ఇక్కడి సామాజిక సాంస్కృతిక నేపద్యం కొంచెం భిన్నమైనదని చెప్పవచ్చు .

తెలంగాణలో సమాజం ప్రత్యేకత

తెలంగాణ సమాజానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి .నిజం కాలములో తెలంగాణకు రాజకీయ ,ఆర్దిక స్వేచ్చలు లేవు . నిరంకుశమైన పరిపాలన! పాలనా యంత్రాంగంలో వచ్చిన మార్పులకు అనుగుణముగా మార్పులు సమాజములోనూ రావాలి . లేదంటే ఆ పాలనా యంత్రాంగం పనిచేయలేదు . కాని అప్పటి సమాజంలో మాత్రం ఆర్దిక అసమానతలు ,సామాజిక పెత్తనాలు యథాతథముగా ఉండిపోయాయి . దీనితో పాలనకు ,సమాజానికి మధ్య వైరుద్యం ఏర్పడింది . ఈ సమాజంలోనూ కులపరమైన శ్రమ విభజన మాత్రం పోలేదు . ప్రతి కులము మొక వృత్తి చేస్తూ ,ఆ గ్రామంలోని వ్యవసాయానికి తోడుపడుతూ ఉండేవారు . దీంతో గ్రామంలో భూమి ఉన్న ఆదిపత్య శక్తులకు మెత్తం గ్రామంపైనా ,సామాజిక శ్రమ పైనా , వస్తు ఉత్పత్తి క్రమం పైనా పెత్తనం ఏర్పడింది . అంటే ప్రతి ఒక్కరు తమ వృత్తిని నిర్వహిస్తూ ఆ వృతి ద్వారా ఆ గ్రామంలోని పెద్దకు సేవలందిచటం ; సౌకర్యాలు కల్పించటమనే ఆనవాయితి కొనసాగుతు వచ్చింది . దీనికి లోబడే సాంస్కృతిక జీవనం పెంపొందింది ఎప్పుడయితే భూసంస్కరణల అమలుయ్యయో ,గ్రామాల్లో రైతులు ఉద్యమాలు జరిగాయో ఈ సంబంధాలు కుడా మారడం మెదలైంది . భూమి బదలాయింపు జరిగింది . చిన్న రైతులు ప్రభలమైన శక్తులుగా ఎదిగారు . అంతకుముందున్న కులపరమైన శ్రమ విభజన , కులపరమైన వెట్టి అనేది కుడా పూర్తిగా అంతరించి పోయి ఇవాళ గ్రామాల్లో ఒక్క చిన్నరైతు ప్రధానమైన వ్యవస్థ . వృత్తలు చేస్తూ బ్రతికే మరికొన్ని కులాల ఏర్పడాయి .కాని ఉమ్మడి రాష్ట్రములో ఈ వర్గాల ఎదుగుదలకు ప్రత్యకమైన విధానాలు అమలు చేయకపోవటంతో వారు నిజంగా ఆర్దికంగా , స్వయం పోశాకంగా ఎదుగలేకపోయారు.
చిన్న కమతలపై వచ్చే ఆదాయాలు చాలక ,పెట్టిన పెట్టుబడి , చేసిన శ్రమకు తగిన ఫలితం దక్కక పోతుండడంతో చాలాసార్లు తీవ్రమైన నిరాశ నిస్పృహలతో రైతులు అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . ఇదే పరిస్థితి చేతి వృత్తుల పై ఆధారపడి బతుకుతున్న వర్గాలలో కూడా మనకు కనిపిస్తుంటుంది .మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి , సాగునీరు , రుణసదుపాయానికి బ్యాకింగ్ వ్యవస్థ మార్కెట్ శక్తుల దోపిడీ నుంచి కాపాడటానికి రక్షణలు , తక్కువ ఖర్చుతో స్తానియమైన పరిస్థితులలో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసుకునే సాంకేతిక వ్యవస్థ , సదుపాయాలు అందించే వ్యవస్థలు ప్రభుత్వం నుంచి ఏర్పడి ఉండాల్సింది . కాని అవి రాలేదు .ఇక్కడి ప్రజలు ఎట్టి పరిస్థుల్లోనూ ఆధిపత్యాన్ని ఏమాత్రం సహించారు . దాన్ని తీవ్రంగా శక్తి మేరకు ప్రతిఘటిస్తారు . అది ఈ సమాజానికున్న ప్రత్యక లక్షణం .
తెలంగాణ సంస్కృతి ప్రత్యకత

ప్రతి ప్రాంతానికి , జాతికి ప్రత్యకమైన సంస్కృతి ఉంటుంది . ఈ వైవిద్యమే ప్రజలను ఒక సమూహంగా ,ఒక జాతిగా భావించేలా చేస్తుంది .ఒకే ప్రాంతములో విభిన్న సంస్కృతులు కుడా ఉంటాయి . విటిన్నిటిలో ప్రతిపలించేదే ఆ ప్రాంత సంస్కృతి.
చారిత్రకంగా , సామాజికంగా , భౌగోళికంగా ప్రజల జీవన విధానాల నుంచి , ఉత్పత్తి సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది . సంస్కృతి రెండు రకాలు మెదటిది ప్రజలు సంస్కృతి , రెండోది పాలక వర్గాల సంస్కృతి . పాలక వర్గాల సంస్కృతిని శిష్ట సంస్కృతిగా ,శిష్ట కళలుగా ,శిష్ట సాహిత్యంగా పేర్కొనవచ్చు . కాని , ఈ సంస్కృతికి పునాదిగా ,భిన్నంగా ఉండేది ప్రజల సంస్కృతి .దీనినే విద్యావిషయకంగా జానపద సంస్కృతి ఎంతో విస్తారమైనది . అందులో జానపద కళల ఒక భాగం .
దక్కన్ పిఠభుమి భూమిలో పరిదవిల్లిందే తెలంగాణ సంస్కృతి .ఇది ఉత్తర దక్షిణ భారతదేశాలకు ముఖ ద్వారముగా ఉంటుంది . మరాఠీ భాష కుడా ద్రావిడ భాషా జన్యమే .దీనిలో ప్రాకృత భాష మాలాలు ఉన్నాయి. తెలుగు భాషలో కుడా ప్రాకృత ప్రభావం ఎక్కువే .కృష్ణా ,గోదావారి నదులు ఎక్కువ శాతం తెలంగాణ భూభాగములో ప్రవహిస్తున్నాయి . వీటి మధ్య ఉన్న తెలంగాణ భౌగోళిక జీవన విధానాల నుంచి ఒక ప్రత్యక సంస్కృతి ఎదిగింది శాతవాహన పూర్వ ఆధారఘట్టలు ఇక్కడ పాలించాయి . అప్పటినుంచి ఎన్నో చారిత్రక ఘట్టాలను చవిచూసిన నేపద్యంలో సంస్కృతి రూపుదాల్చింది . ఇక్కడ ఆదివాసి మతాలు ,బౌద్ద,జైన వీరశైవ మతాలు ఆయా దశల్లో ఎంతో ప్రాచుర్యం పొందాయి . వీటి ప్రభావాలతో కుడా ఒక ప్రజా సంస్కృతి కనిపిస్తుంది .వాటి ఛాయలతో సాంస్కృతిక మాలాలు ఏర్పడాయి . తెలంగాణ శ్రామిక సంస్క్రతిలో నుంచి ఎంతో మౌఖిక సాహిత్యం ఏర్పడింది . ప్రదర్శన కళలు కుడా ఎక్కువ పాళ్ళలో ఉన్నాయి .ఇప్పటికి అవి సజీవంగా మనగలుగుతున్నాయి.దీన్ని తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక లక్షణముగా భావించవచ్చు . ఇలా ఎన్నో రకాల కళా సంస్కృతులు తెలంగాణలో కనిపిస్తాయి .

తెలంగాణ సమాజంలో కుల వృత్తులు

చాకలి : ఇది పల్లెల్లోచాలా ప్రధానమైన వృత్తి .చాకలి లేనిదే పల్లెలో సాంప్రదాయమైన పనులు చాలా జరుగవు . వారి ముఖ్యమైన పని అందరి బట్టలను ఉతికి తేవడం . ఊరి వారి బట్టలు అన్ని కలిపి ఉన్నా సాయంత్రానికి ఎవరి ఇంటి బట్టలు వారివి వేరు చేసి వారికిస్తారు . బట్టలను వారు అంత బాగా గుర్తు పట్టగలరు . అందుకే చదివిన వాడికన్న చాకలి మిన్న అన్న నానుడి పుట్టింది
.
మంగలి : మంగలి వృత్తి కూడా సమాజంలో చాలా ప్రధానమైన వృత్తి ప్రతి సారి ప్రతిఫలం ఆశించకుండా అందరికి క్షవరం చేసేవారు ఆపనికి గాను ప్రతి పంటకి , ఆరు బుడ్లు వడ్లు (3 కుండలు ) , వరి గడ్డి తీసుకునేవారు తలంటు స్నానం చేయిచటం వంటి పనులు చేసేవారు . ప్రతి రోజు మంగలి పల్లెలోకి వచ్చి క్షురక వృత్తి చేసేవారు .

కుమ్మరి : కుమ్మరి మట్టితో కుండలు చేసి కాల్చి రైతులకు ఇచ్చేవారు . వీరికి కుడా ప్రతి ఫలితానికి మేర వరి మోపు ఇచ్చేవారు . పెద్ద వస్తువులైన , కాగు , తొట్టి , ఓడ మొదలగు వాటికి కొంత ధాన్యం తీసుకుని ఇచ్చేవారు . పెళ్లి సందర్భంగా అరివేణి కుండలని కుమ్మరివారు ఇవ్వాలి . అనగా కొన్ని కుండలకు రంగులు పూసి కొన్ని బొమ్మలు వేసి ఇచ్చేవారు .

వడ్రంగి : కర్రలతో పనిముట్లు తయారు చేస్తారు .నాగలి , కాడిమాను ,ఎద్దుల బండి , ఇంటి సామానులు తయారు చేయడం వీరి పని వ్యవసాయం యాంత్రికరమైన ఈ రోజుల్లో వడ్రంగి చేయవలసిన వ్యవసాయ పనిముట్లు ఏమి లేవు . అయినా ఇంటికి సంబంధించిన ద్వారాలు ,కిటికీలు ,వంటి పనులు విరికి ఎక్కువగా ఉన్నాయి . వారు ఇప్పటికి పూర్తి స్తాయిలో పనులతో నిమగ్నమై ఉన్నారు .

మేదర : వెదురు బద్దలతో తట్టలు ,బుట్టలు ,చాట్లు ధాన్యాన్ని నిల్వచేసే బుట్టలు , ఎద్దుల బండికి వేసే మక్కిన వంటివి అల్లుతారు . గతంలో అడవులలో వున్న వేదుర్లను కొట్టి తెచ్చి తట్టలు బుట్టలు అమ్మేవారు . అప్పట్లో బుట్టలు , మొక్కనలు , వంటి పెద్ద పెద్ద సామానులను తయారు చేయడంలో వారికి ఆదాయం బాగా వుండేది తాము తయారు చేసిన వస్తువులను రైతులకు ధాన్యానికి ఇచ్చేవారు .
జంగం వాళ్ళు : జంగం వారి జనాభా అతి తక్కువ . ముఖ్యంగా విరు శివ భక్తులు . విరభద్రుని ఆలయాల్లో పూజారులు విరే ఉంటారు . గతములో విరు కొన్ని పల్లెలను తమలో తమకు కేటాయించుకొని ఆ పల్లెల్లో కార్తిక మాసంలో (నేలంతా ) తెల్లావారు జామున తిరుగుతూ గంట వాయిస్తూ , శివనామ సుత్తి చేస్తూ తిది , వార ,నక్షత్రాలను చెప్పి తెల్లావారి ప్రతి ఇంటి ఆసామి వద్ద సంభావన పొందుతారు . ఇలా తిరిగే వారిని జంగం దేవార అని అంటారు విరు శుభాశుభాలను చెప్పుతారు . వీరికి సమాజంలో బ్రహ్మణుల తరువాత గౌరవ స్తానం ఉంది .విరి వేషధారణ కుడా గౌరవప్రదంగానే ఉంటుంది .కాషాయ వస్త్రాలను ధరించి ,తలపాగా కట్టి , భుజాన కావడి లేదా జోలె ,ఒక చేతిలో గంట , రెండో చేతిలో శంఖం వుంటుంది .

కమ్మరి : లోహ వస్తువులను తయారు చేసే వారిని కమ్మరి అంటారు వీరు కత్తులు , గోడ్డల్లు , కొడువళ్ళు వంటి లోహ సామానులు చేసేవారు ఇప్పుడు వాటి అవసరం ఎక్కువ లేదు .అయినా యంత్రాలతో తయారైన రెడీమేడ్ పరికరాలు సంతల్లో దొరుకుతున్నాయి . గతములో అక్కడక్కడా కొలిమి ఉండేది . కాని ఈ రోజుల్లో కొలిమి ఎక్కడా లేదు.

గాజుల వాళ్ళు : ఆ రోజుల్లో గాజుల శెట్టి తన మలారం భుజాన వేసుకొని పల్లెల్లో తిరిగేవారు. మలారం అంటే : సన్నని పొడువైన దారాలకు గాజులను రెండు వైపులా గుత్తులు గుత్తులుగా కట్టి ఆ దారాలన్నిటిని మద్యలో ఒకటిగా కట్టి దాన్ని భుజాన వేసుకుంటారు . గాజుల వాళ్ళు కొన్ని పల్లెలను తమ ప్రాంతముగా విభజించుకొని ఆ పల్లెలో వారికి గాజులను అమ్మేవారు .

మాల : వీరు హరిజనులు .వీరు ఎక్కువగా కులిలుగా ఉండే వారు .విరిలో కుడా భూములున్న వారు కొందరుండేవారు . వీరు వ్యవసాయ పనులు చాలా బాగా చేస్తారు.

మాదిగ : వీరు కుడా హరిజనులే . కాని వీరి జన సంఖ్య తక్కువే . వీరు చెప్పులు కుట్టడం , తోలుతో చేసిన కపిలి బానలను కుట్టడం ,అవకాశం ఉన్నప్పుడు రైతు పొలములో కూలికి వెళ్ళడం చేసేవారు . వీరి వద్దనే చెప్పులు కుట్టిచుకునేవారు . ఇటివల కాలంలో వీరి వృత్తి మరుగున పడిపోయింది .

బెస్తవారు : బెస్త వారి కులంలో అనేక ఉప కులాలున్నాయి . గంగాపుత్ర ,వంనేకుల క్షత్రియ ,పలి కాపు ,అనే కులాలు ఇందులోనే వున్నాయి . బెస్త వారి వృత్తి చేపలు పట్టడం . ఈ కులం వారు కృష్ణా, గోదావరి , నది ప్రాంతాలలో ఎక్కువగా ఉన్నారు . మిగతా ప్రాంతాలలో వీరి జన సంఖ్య చాలా తక్కువ . వీరు చేపలు పట్టడం తప్ప మరే పని చేయలేరు . తిర ప్రాంతాలలో ఉండే బెస్తలకు దిన దిన గండం నూరేళ్ల వయస్సుగా బ్రతికిడుస్తున్నారు . వారి వృత్తి ప్రాణాలతో చేలగాటమే . చేపలు పట్టే పడవలు , బొట్లు లక్షలాది రూపాయల విలువ చేస్తాయి . వాటిని విరు కొనలేరు . పెద్ద `ఆసాములు పడవలను కొని బెస్త వారికి అద్దెకిస్తారు వీరి అద్దె విధానం వైవిధ్యంగా ఉంటుంది . జూలై ,ఆగష్టు నెలల్లో చెరువుల్లో చేప పిల్లాన్ని వదిలి మార్చి నుంచి మే వరకు చేపలను పాడుతారు .
సాలె వారు : సాలె వారి వృత్తి మగ్గం పై బట్టలు నేయడం .
కంసాలి : వీరు ప్రధానంగా గ్రామాలలో బంగారు , వెండి , కంచు లోహాలను ఆభరణాలుగా తయారుచేయడంలో సిద్దహస్తులు . వీరు గ్రామ ప్రజలకు కావాల్సిన ఆభరణాలు , దేవతా ఉత్సవాలకు సంభందిచిన ఆభరణాలును తయారుచేస్తారు .
మేరదర్జీ (లేదా ) మేర : గ్రామ ప్రజలకు కావాల్సిన దుస్తులను కుట్టడం వీరి వ్రుత్తి .

గొల్లలు ( యాదవులు ) : వీరు ప్రధానముగా గ్రామాలలో పశుసంపదలను కలిగి వుంటారు . అనగా వీరు గొర్రెలు , గేదలు ,మేకలు మొదలెన వాటిని పెంచి సంతలో విక్రయించుట ద్వారా జీవనంను గడుపుతారు .

గౌడ : వీరు ప్రధానముగా గ్రామాలలో తాటి ఈత చెట్లను పెంచి వాటి ద్వారా వచ్చే కల్లును విక్రంయిచటం ద్వారా జీవనం గడుపుతారు .
కోమటి (వైశ్యులు ) : వీరు ప్రధానముగా గ్రామ ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను విక్రంయిచుట ద్వారా జీవనంను గడుపుతారు .
కాపులు : వీరు ప్రధానంగా వ్యవసాయంను , పశుసంపదను కలిగి ఉంటారు .

బ్రహ్మణులు : వీరు గ్రామాలలో చాలా తక్కువ జనాభాను కలిగి ఉంటారు . వీరు ఆయా గ్రామాలలో గల దేవాలయలో యందు పూజారులుగా ఉంటూ జీవనం ను సాగిస్తారు .

మున్నూరు కాపులు : వీరు కుడా వ్యవసాయం చేయుటం వ్యాపారం చేయుట ద్వారా జీవనం సాగిస్తారు .

వడ్డెర : వీరు ప్రధానంగా గ్రామాలలో బావులు తవ్వటం , రాళ్ళు కొట్టడం ద్వారా జీవనం కొనసాగిస్తారు .

కటిక & ఆరేకటిక : వీరు ముఖ్యంగా మాసం వ్యాపారులుగా వృత్తిని నిర్వహిస్టారు .

ధన్వతరిలు : వీరు గ్రామాలలో ప్రజలకు వేద్య పరిక్షలకు , శస్త్ర చికిత్సలు చేసి వారికి ఆయుర్వేద ఔషధాలను విక్రంయిచుట ద్వారా జీవనం సాగిస్తారు .

వెలమ : వీరు ముఖ్యంగా రైతులుగాను , రాజకీయ నాయకులుగా , పాలకులుగా వుంటూ జివనంను సాగిస్తారు .
దొమ్మరి : ఇది తెలంగాణ రాష్ట్రంలో కనిపించే ఒక సంచార జాతి . వీరిలో కొందరు వీధిలో సర్కస్ ప్రదర్శనలు ఇచ్చి సంపాదిచేవారు . ఒక్కపుడు పడపు వృత్తే వీరి జీవనాధారం . ఆడవారు ఇళ్ళలో పాచి పనులు , మగవారు గేదెల కొమ్ములు కోయడం , అడవి ప్రాతంలో తెచ్చుకున్న కర్రలతో చెక్క దువ్వెనలు , ఈరిబానులు తయారు చెసూకొని వాటిని ఉరూర తిరిగి అమ్ముకొని జీవనాన్ని నెట్టుకొస్తున్నారు . దువ్వెనల తయారీల , పందుల పెంపకం వీరి కుటీర పరిశ్రమలు .వారు ఒళ్ళు గగుర్పోడ్చి విద్యలు ప్రదర్శిస్తారు . సన్నటి తాడుపై నడచి అబ్బుర పరుస్తారు .బిందె మిధ బిందెలు పెట్టి వాటి పైన సాహసాలు చేస్తారు .గడ ఎక్కి ఊరికి శుభం కలగాలని మనస్పూర్తిగా కోరుకొంటున్నారు .

ఇతర జాతులు : లంబాడి , బంజర ,ఎరుకల ,నామక , గోండు మొదలైనవారు సంచారం చేయుటం ద్వారా జీవిస్తారు . వీరు అడవిలో చెట్లవేర్లను తెచ్చి అమ్ముట ద్వారా , తేనే ,చింతపండు మొదలైన్ ఉత్పతులను సేకరించి అమ్మటం ద్వారా జీవనంను సాగిస్తారు .
పల్లె వాసులపై ఆధారపడిన యాచక వృత్తి వారు అనేకం ,అందులో ముఖ్యమైనది బుడుబుక్కల . వీరి వేషధారణ చాలా గంబిరంగా వుంటుంది నొసటన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని కొట్టు వేసుకొని , మెడ పై అటు ఇటు కింది వరకుబ్ వేలాడుతున్న చీరలను ధరించి ,కుడి చేతిలో చిన్న డమరుక / బుడబుక్కను ధరించి డబ డబ వాయిస్తూ అంబ పలుకు జగదంబా పలుకు … కంచిలోని కామాక్షి పలుకు ,కాశిలోని విశాలక్షి ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ ఆయా గృహస్తుని కష్టాలను ఎకరపు పెడ్తాడు . ఇదిగో అంబ పలుకుతున్నది అంటూ తన బుడబుక్కను వాయిస్తూ ఆకాశం వైపు చూస్తూ ఏవేవో మాయ మాటలు చెప్పి వాటిని అంబ పలుకుతున్నదని నమ్మిస్తాడు .ప్రతిఫలంగా కొంత ధాన్యాన్ని పొందుతారు . వీరి ప్రస్తావన ఈ కాలంలో చాలా అరదుగా ఉన్నది .ఇంకా పూర్తిగా మాసిపోలేదు .

కొండ రాజులు : కుర్రు తోకన్నలు . వీరు కుడా గంభీరమైన ఆహార్యంతో ఉంటారు . భుజాన జోలితో ,ఎర్రటి వస్త్రాలను ధరించి ,నెత్తిన తలపాగాతో , అందులో నెమలి పించం పెట్టి రాజసం ఉట్టిపడేలా వస్తారు . కుర్రో కుర్రు …. కొండ దేవరా పలుకు .. అంటూ పల్లె వాసులను తమ మాయా మాటలతో వశీకరణ చేసుకొని , వారి కష్టాలకు నివారణోపాయాలు చెప్పి కొంత ధాన్యం ప్రతిఫలంగా పొందుతారు .

మొండోళ్ళు : వారు ఏ రైతు ఇంటి ముందు వాలినా వారు బిచ్చం వేసేంత వరకు వెళ్ళరు . అందుకే మొండుల్లు అని అన్నారు . వారి నుండి పుట్టినదే ఈ సామెత మోన్దోడు రాజు కన్నా బలవంతుడు . వారు రైతు ఇంటి ముందు భయానక దృశ్యాలను ప్రదర్శిస్తారు . రక్తసిక్తమైన పసిపల్లవాన్ని చాటలో పెట్టి దాన్ని ఇంటి ముందు పెట్టి పెద్ద కొరడాతో తనను తాను కొట్టుకుంటారు . అతని భార్య తన మెడకు వేలాడుతున్న ఒక వాయుధ్య వింత వింత శబ్దాలు చేస్తూ పాటలు పాడుతుంది
వాయుద్య సహకారంతో పాటలు పాడి యచిస్తారు. రైతుల పైన , వారి పొలాల పైన ఆధారపడి ప్రత్యక్షంగానో , పరోక్షగానో బ్రతికే అనేక ఆశ్రితజాతుల వారు ఆ రోజుల్లో చాలా సంతోషంగానే కాలం గడిపేవారు .

చిలక జోస్యం : ఒక పంజరంలో చిలకను పెట్టుకొని పల్లెల్లో తిరుగుతూ జోస్యం చెపుతుంటారు .వీరు మంచి మాటకారులు . వీరిని ఎవరైన తమ ఇంటికి పిలిస్తే వెళ్లి కోర్చోని చిలక పంజరాన్ని కింద పెట్టి సుమారు ఒక ఇరవై కవర్లను వరుసగా పేర్చి పెడతారు .ప్రతి కార్డులో ఒక దేవతా బొమ్మ మరొక కార్డుపై చెప్పించు కోదలచినవారి పేరు అడిగే పేరును బట్టి అతని నామ నక్షత్రము చెప్పి దానికి సంబంధించిన కొన్ని మాటలు చెపుతాడు . ఆ తర్వాత పంజరం తలుపు తిసి చిలకను బయటకు పిలుస్త్గాడు .ఆ చిలుక అక్కడ పరిచిన ఇరువై కవర్లలో నుండి ఒక కవరును తన ముక్కుతో తోసి బయట పడేస్తుంది . దానిని జ్యోతిష్కుడు తిసి అందులోని దేవతా బొమ్మని చూపి జరిగినవి , జరుగాబోయే విశేషాలను ఏకరువు పెడతాడు .తర్వాత మరో కార్డులోని విషయాన్ని చదివి కొన్ని లెక్కలు వేసుకొని సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తాడు .

యాచక వ్రుత్తి వారు : చాలా కాలం క్రితం జానపద కళారితులకు బాగా ఆదరణ వున్న రోజుల్లో ఆయా కళాకారులకు ప్రజల్లో మంచి గౌరవం వుండేది అటువంటి వారిని పల్లె ప్రజలు పిలిపించుకొని వారి కళా రూపాన్ని ప్రద్ర్శిపచేసుకొని ఆనందిచి వారికి కొంత సంభావన ఇచ్చేవారు . ఆ విధంగా వారి జీవనం గౌరవప్రదంగా సాగేది అలంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి . బుర్ర కథ , ఉగ్గు కథ మొదలైనవి . ఆ తర్వాత చెప్పుకోదగ్గ యాచకులు పాముల వాళ్ళు. విరు రైతు ఇంటి ముందు తమ బుట్టలో ఉన్న పాములను బయటకు తిసి పాముల బుర్ర వుడుతూ నాగు పాములను ఆడిస్తుటారు .
విదిగారడీవారు : వీరు ఎక్కువగా దోమ్మరివారై ఉంటారు . వీరు కుటుంబం తో సహా పల్లెలో తిరుగుతూ చిత్ర , విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు వీరు చేసే విన్యాసాలలో ముఖ్యంగా చెప్పుకోదగినవి …. ఇనుప రింగులలో తలను కాళ్ళను ఒకేసారి దూర్చి బయటకు రావడం , పిల్లలచే శారీరక విన్యాసాలు చేయించడం ఇలా అనేక విన్యాసాలు చేసి చివరకు ప్రదర్శన మద్యలో గుద్దపరిచి ,లేదా ప్రేక్షకుల వద్దకు వెళ్లి యాచిస్తుంటారు ఇలాంటివి ఎక్కువగా సంతలు , జాతరలు , ఇతర ఉత్సవాలు జరిగే చోట ప్రదర్శిస్తుంటారు .
పల్లెల్లో వాణిజ్యం : రైతుల తమకు కావలసినంత తిండి గింజలను దాచుకొని మిగతా దాన్ని అమ్మేవారు కాని ఎక్కువగా బెల్లం , వేరుశెనగ కాయలు , కూరగాయలు , పండ్లు మెదలగునవి మాత్రమే అమ్మేవారు దాని ద్వారా మాత్రమే రైతులకు డబ్బులు అందేవి .కాని ఊర్లలోకి అమ్మ వచ్చే మాములు వస్తువులకు వస్తు మార్పిడి పధ్ధతి అమలులో వుంది ఉప్పు కావాలంటే కొంత ధాన్యాన్ని ఇచ్చేవారు వడ్ల విలువ ఉప్పు విలువను రైతు మహిళలు బేరీజు వేసుకొని చూసేవారు కాదు వారికి అతి సులభంగా అందుబాటులో వున్నవి వడ్లు ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎక్కువగా వడ్లుతోనే జరిగేది . ధాన్యానికి వస్తువులు ఇవ్వడం కేవలం పల్లెల్లో మాత్రమే జరిగేది సంతల్లో ఇటువంటి వ్యాపారం లేదు . అక్కడ ఎ వస్తువైనా డబ్బుచ్చి కొనాల్సిందే . డబ్బు చలామణి అతి తక్కువ ముఖ్యంగా రైతు స్త్రీలలో డబ్బును తమ వద్ద ఉంచుకున్న వారు ఆ రోజుల్లో చాలా అరుదు . ప్రస్తుతం ధాన్యంతో వస్తు మార్పిడి ఎక్కడా లేదు .కాని దాని ఆనవాలుగా సిసాలకు , పాత పుస్తకాలకు ఐసు క్రీం చింతగింజలకు చిలగడదుంపలు , కొబ్బైరికి కొబ్బరినునే , అముదాలకు ఆముదం , వేపగింజలకు వేపనునే కానుగ గింజలకు కానుగ నునే ఇలా కొంత వస్తు మార్పిడి వున్నది . ఈ రోజుల్లో ప్లాస్టక్ సామానులు ఎక్కువయ్యాయి పల్లెల్లో వీటికి ఆదరణ ఎక్కువ . బిందెలు , బక్కెట్లు వంటి ప్లాస్టక్ సామానులు ఎక్కువగా వాడుతారు . దానికి కారణమేమంటే అవి చాలా తేలికగా ఉంటాయి పాడైన పాత ప్లాస్టిక్ సామనులకు కొత్త ప్లాస్టిక్ సామానులు ఇస్తున్నారు పాడైన ఇనుప సామాను కుడా తీసుకొని కొత్త పాత్రలను ఇస్తున్నారు ప్రస్తుత పట్టణాలలో ఇదొక పెద్ద వ్యాపారం .
సంతలు : పల్లెవాసులు పండించిన కూరగాయలు , మొదలగు వాటిని విక్రయించడానికి గతంలో వారాంతపు సంతలు ఉండేవి వారంలో ఒక రోజు ఒక గ్రామంలో సంత జరుగుతుంది చుట్టూ ప్రక్కల పల్లెవాసులు తాము పండించిన కూరగాయలు పండ్లు ఇతర వస్తువులు అమ్ముకోవడానికి తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి ఈ వారపు సంతలు చాలా ఉపయోగకరంగా ఉండేవి . రైతులేకాక ఆ సంతలో కుమ్మరి వారు కుండలను , మేదరి వారు తట్టలు బుట్టలు , చాట్లను , కమ్మరి వారు కత్తులు , కొడవళ్ళు మొదలగు ఇనుప వస్తువులను సంతకు తెచ్చి అమ్మేవారు . ఈడిగ వారు దువ్వెనలు , కుంకుమ భరిణి లు , గాజుల వారు గాజులను ఇలా అనేక వస్తువులను ఈ సంతలో అమ్మేవారు ఈ సంతలకు ఇతర ప్రాంతాల నుండి అనేక వస్తువులు అనగా బట్టలు , తినుబండారాలు ,ఇతర కిరణా వస్తువులు మెదలగు అలంకరణ సామగ్రిని ఎద్దుల బండ్ల మిధ తెచ్చి అమ్మేవారు తాము తెచ్చిన వస్తువులను అమ్ముకొని తమకు కావాల్సిన వాటిని కొనుక్కోవడానికి ఈ సంతలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి .
కుల గురువులు : ఇది ఒక జాతి అతి పురాతనమైన సాంప్రదాయం . ప్రతి కులానికి కుల గురువుల వ్యవస్థ వుండేది వారు ఒకబ్ పద్ధతి ప్రకారం అనేక పల్లెలను సందర్శిస్తారు అయావారి కులాచారాలను , గోత్ర నామాలను ఇతరమైన కుల సాంప్రదాయాలను చెబుతారు .కుల గురువులు కూడా ఆ కులానికి చెందినవారే .కొన్ని కులాలో ఈ వ్యవస్థ ఈ నాటికి ఉన్నది

తెలంగాణ కళారూపాలు

తెలంగాణ వైవిద్యభరితమైన జానపద కలారుపాలకు పెట్ట్టింది పేరు తరతరాలుగా కళాప్రదర్శనే తమ వృత్తిగా స్వీకరించి జీవనం సాగిస్తున్న కళాకారులుగా అధికంగా తెలంగాణలో ఉన్నారు త్యాగం తీసుకునే మిరాశిహక్కు కల్గిన కళాకారులు విరు . త్యాగం తీసుకొన్నాక కళా ప్రదర్శనలు ఇస్తారు అలాగే త్యాగం సాంప్రదాయంలేని వృత్తి కళాకారులున్నారు .