Ground Water

భూగర్బ జలం

భూ ఉపరితలం క్రింద వున్న కట్టిన శిలలోని సంధులు భ్రంశాలు మరియు శూన్య ప్రదేశాలలో చేరి వుండే జలాలని భూగర్బజలం అని లేదా అంతర భౌమ జలం అని అంటారు .
భూగర్బ జలాల మూల స్తానం :- భూజలం ప్రధానంగా 3 మూలల నుంచి సమకూరుతుంది .
వాతావరణం నుంచి & వాతావరణ జాలం :- అవపాతనం చెందిన వర్శపాతనం లేదా హిమపాతం వల్ల లభించే నీటిలో సుమారు సగానికి పైగా అవరంచి వుంది మరియు భాష్పోత్సేకం వల్ల తిరిగి వాతావరణాన్ని చేరుతుంది సుమారు 1 /4 వ భాగం వాగులు నదులు రూపంలో భూమి ఉపరితలం పై ప్రవహించే నిరు సముద్రాన్ని చేరుకుంటుంది మిగిలినవి భూ పటలంలో శిలలోని పగుళ్ళు శూన్యమైన ప్రదేశాలు మెదలగు వాటిలో చేరి అంతర్ శ్రవణం చెంది భూగర్బ జలంగా మారుతుంది దీనినే మేర్క్యురిక్ జలం అంటారు .
శిలాస్త జలం :- భూగర్బ జలాలకు 2 వ మూల స్తానం ప్రస్తుత ఖండాలలో వున్నా అవక్షేప శిల సముదాయాలు ఇవి ఏర్పడేట ప్పుడు ప్రతి ఇసుక రేణువుల చుట్టూ సన్నటి పొరగా ఆవరించి వున్నా నిరు క్రమంగా ఒక చోట చేరి శిలాస్తమై ఉంటుది దీనినే శిలాస్త జలం అంటారు .
మాగ్మాటిక్ & తరుణజలం :- భూగర్బ జలాలు 3వ మూలస్తానం భూగర్బంలో లోతైన ప్రదేశాలలో ఏర్పడే మాగ్మాలు ఆయా ప్రాంతాల లోపల నుంచి పెద్ద ఎత్తున మాగ్మాను భూ పటలంలోకి చొచ్చుకొని వచ్చినప్పుడు అక్కడ సహజముగా వున్నా అంతర్ జలాలలో ఈ మాగ్మా జలాలు కలిసిపోతాయి ఈ జలాన్ని తరుణ జలం అంటారు .
కొన్ని ఉష్ణశ్రోతస్సులలోనూ , ఉష్ణ ద్రవ నిర్గాలాలు ఏర్పడే జలాలు కొంత వరకు మాగ్మా జలాలకు సంబంధించినవే .
భూగర్బ జలాల విస్తరణ :- భూ ఉపరితలం క్రింద కొద్ది లోతు వరకు వున్న మండలంలోవున్న శిలలు పగుళ్ళతో ఉంటాయి అందువల్ల ఈ మండలంలో వాయు ప్రసారమే కొని జల సముదాయాలు ఏర్పడి వుండవు ఈ మండలంలో మట్టి ఎక్కువగా వుంటుంది ఈ మట్టి రేణువులను అవరంచి నిరు వుంటుంది ఈ నిటి తేమను వృక్షాలు తమ వేర్లు ద్వారా గ్రహిస్తాయి ఈ మండలంలో వర్షం కుర్సినప్పుడు తప్ప తక్కిన సమయాలలో ఇక్కడ జలప్రసారం చాలా తక్కువగా ఉంటుంది ఈ మండలాన్ని వేడోజ్ మండలం అని అంటారు
దిని తర్వాత వుండే మండలం అంటారు ఈ మండలంలో వుండే శిలలోని పగుళ్ళ అని నీటితో నిండి ఉంటాయి కాబట్టి దీనిని సంతృప్త మండలం అని అంటారు ఈ మండలంలోని నిటి పై మట్టాన్ని భూజల తలం అని అంటారు ఈ భుజాల తలం ఎగుడు దిగుడుగా వుంటుంది ఎత్తెన కొండల మిది భాగాలలో భూజల తలం యొక్క లోతుగా వుంటుంది కాని లోయలలో ఇది భూ ఉపరితలానికి దగ్గరగా వుంటుంది ఈ భూజల తలం యొక్క లోతు స్తిరంగా ఉండక ఋతువులను ప్రాంతాన్ని బట్టి మారుతుంది
ఉపవిశిష్ట భుఉజల తలం :- కొన్ని చోట్ల వేడోజ్ మండలంలో కొంత నిటి సముదాయమే ముఖ్యమైన భూజలం పై భాగాలలో ఏర్పడి వుంటుంది దీనినే ఉపవిశిష్ట భూజల తలం అని అంటారు .
ఇది సాధారణంగా వాయు ప్రసారిత మండలంలో వున్న అప్రవేశ యోగ్య శిలల పై భాగంలో కొన్ని చోట్ల ఏర్పడి వున్న ప్రవేశ యోగ్య శిలలో చేరివుంటుంది అందువల్ల నిరు లోతుగా ప్రధాన భూ జల తలంలో ఎటువంటి సంభందం లేకుండా ఈ మండలంలో వుంటుంది
అంతర్ జల చలనం :- భూమి ఉపరితలంపై ప్రవహించే జలాల వలే కాకుండా అంతర్ భౌమ జలాలుగా చాలా నెమ్మదిగా కదులుతాయి ఈ ప్రవహించే వేగం అవి ప్రవహించే శిలల సచ్చిద్రత పారగామ్యతలపై ఆధారపడి వుంటుంది .