Geology

భౌమప్రక్రియలు
భౌమాకాలమంతట భూ పటలములోని దాని ఉపరితలం మిద దాని పదర్తాలతో నిర్మితిలలో భూ సముద్రభాగా విస్తరణలో పర్వతాలు మైదానాలలో చివరకు శీతోష్ణస్థితి వాతావరణ పరిస్థితులలో కుడా ఎన్నో రకాల మార్పులు సంభవిస్తూ వచ్చాయి ఈ మార్పులకు కారణమైన ప్రక్రియలను భౌమప్రక్రియలు అని అంటారు .
ఇవి రెండు రకాలు అవి : బహిర్ భౌమ ప్రక్రియలు 2 అంతర భౌమ ప్రక్రియలు
బహిర్ భౌమ ప్రక్రియలు : శైథిల్యం క్రమక్షయం & నిక్షేపణ ఈ రీతికి చెందినది
అంతర్ భౌమ ప్రక్రియలు : భూ కంపాలు అగ్ని పర్వతాలు ఈ రీతికి చెందినవి
బహిర్ భౌమ ప్రక్రియలు : బహిర్ భౌమ ప్రక్రియలు భూమి ఉపరితలం పైన జరుగుతూ భూమిపైన ఎత్తు పల్లాలను ఒక సాధారణ మట్టానికి తిసుకరావడానికి దోహదం చేస్తాయి అందువల్ల వీటిని శ్రేణికరణం లేదా విఘశికరణం అని అంటారు
శ్రేణికరణం రెండు రకాలు అధ శ్రేణికరణం ఉధ శ్రేణికరణం
అధ శ్రేణికరణం : శైథిల్యం మరియు క్రమక్షయం భూమి ఉపరితలం మిద ఉండే ఉన్నత భాగాలను కోసివేస్తూ సాధారణ మట్టానికి రావటానికి దోహదపడుతాయి కాబట్టి వీటిని అధశ్రేణికరణం అని అంటారు .
ఉదశ్రేణికరణం : నిక్షేపణ ప్రక్రియ భూ ఉపరితలం మిద ఉండే లోతట్టు భాగాలను నింపి వాటి మట్టం పెరగటానికి దోహదపడుతాయి కాబట్టి వీటిని ఉదశ్రేణికరణం అంటారు
ఈ శ్రేణికర ప్రక్రియలు మన చుట్టూ ఎప్పుడు పనిచేస్తూ భూ దృశ్యాలలో మార్పులు తీస్తూ ఉంటాయి ఈ శ్రేణికర కారకాలలో ముఖ్యమైనవి నదులు , భూగర్బజల సముద్రాలూ సరస్సులు పవనములు . అంతర భౌమ ప్రక్రియలు భూమి లోపల ఉద్భవించినప్పటికీ వాటి ప్రభావం భూమి ఉపరితలం మిద కుడా కన్పిస్తుంది .

భూమి అంతరనిర్మితి
భూమి అంతరనిర్మితి ప్రత్యక్షంగాను గమనించే అవకాశం లేకపోవడం చేత భూకంప తరంగాల ద్వారా భూమి అంతర్ బాగా నిర్మితిని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు భూకంప తరంగాల వేగం మారినప్పుడు అచట సంగటనలో మార్పు ఉన్నట్లు తెలుస్తూంది అంటే శీలా మండలలో మార్పు ఉన్నట్లు తెలుసుకోవచ్చు .
భూమి అంతర్బాగాని స్తూలంగా మూడు మండాలాలుగా విభజించవచ్చు
1 . భూపటలం 2 . ప్రవారము ౩. కేంద్రమండలం

భూపటలం : crust :- భూమి పై భాగం పొరలు పొరలుగా వుండి గుళ్ళబారినట్టు వుంటుంది దీనినే భూపటలం అంటారు దీనిలో అనేక రకాలైన శిలలు చాలా చోట్ల మట్టి కాని ఇసుక కాని కప్పివుంటుంది భూపటలం ఇంచు మించు 50 నుండి 60 కి.మి.ల లోతు వరకు వ్యాపించి వున్నటు శాస్త్రజ్ఞుల అంచనా భూ పటలం 2 పొరలుగా వుంటుంది అందులో పైన పొరను sial మండలం అని క్రింది పొరను sima మండలం అంటారు .
sial :- sial పొర ముఖ్యంగా గ్రానైట్ శిలలతో నిర్మితమై వుంటుంది దిన్ని విశిష్ట గురుత్వ్హం 2 .7 రసాయన దృష్టితో చూస్తే ఈ శిలలో సిలికా మరియు అల్యూమినియం అనే ఘటకాలు చాలా ప్రముఖంగా వుండటం వలన sial నే సున్యాసుచాక పేరు పెట్టినారు భూమి ఉపరితలం పై కనిపించే పెద్ద పెద్ద ఖండాలు అన్ని sial పోరలోని ముఖ్య భాగాలు
sima : – ఈ మండలంలో వుండే శిలలు బసాల్ట్ శిలలను పోలి ఉంటాయి వీటి విశిష్ట గురుత్వం 3 .3 వీటిలో సిలికాన్ మరియు మెగ్నీషియం వంటి ప్రముఖ ఘటకాలు వుండటం వల్ల ఈ పొరకి sima అని పేరు పెట్టారు సముద్రం అడుగు భాగానా వుండే ప్రదేశాలు చాలా వరకు sima పొరతో నిర్మితమై ఉంటాయి .
ప్రవారము manitl :- ఇది భూ పటలం క్రింద వున్నా మండలాన్ని ప్రవారము అని అంటారు దిని యొక్క లోతు 2900కిలోమీటర్లు ఇక్కడ వుండే శిలల సాంద్రత ఎక్కువగా వుంటుంది ప్రావరాములో ఐరన్ మరియు మంగనిస్ ఘటకాలు ఎక్కువగా ఉంటాయి ప్రవారము పై భాగములో 62 .700కిలోమీటర్ల లోతున ఒక విశిష్ట మండలం వుంటుంది దీనిని బలహన ఆవరణం అని అంటారు అంటే ఇది వేడిగా బలహినముగా వుండి దీనిలోని శిలామయ పదార్తాలు ఒత్తిడికి లోనైనప్పుడు కొంత వరకు కదులుతాయి .
కేంద్రమండలం :- ప్రవారము క్రింద నుండి 6371 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న మండలాన్ని కేంద్ర మండలం అని అంటారు ఈ మండలం నికెల్ మరియు ఐరన్ ఘటకాలతో కుడి వుంటుంది దీనిలో నికెల్ మరియు ఐరన్ వుండటం వల్ల దీనిని knife అని కూడా అంటారు దిని యొక్క సరాసరి విశిష్ట గురుత్వం 10 .7 ఈ కేంద్ర మండలంను తిరిగి రెండు విభాగాలుగా విభజించబడింది .అవి
బాహ్య కేంద్ర మండలం :- ఇది ద్రవస్థితిలో వుటుంది దిన్ని యొక్క లోతు 29,00 కిలోమిర్ల నుండి 5150 కిలోమీటర్ల ఉంటుది
అంతర్ కేంద్ర మండలం :- ఇది ఘన స్తితిలో వుంటుంది దిన్ని యొక్క లోతు5150 కిలోమీటర్ల నుండి 6361 కిలోమీటర్ల వరకు ఉంటుంది .