తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పధకాలు

మిషిన్ భగీరథ ప్రారంభం

తెలంగాణాలో ప్రతి ఇంటికి తాగునీరు అందిచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం చేపటిన భగిరధ తొలి యూనిట్ ను ప్రధానమంత్రి నరేంద్రమోడి 2016ఆగస్టు 7 న గజ్వల్ సమీపంలోని కోమటి బండలో ప్రారంభించారు భగీరథ పథకాన్ని రూ .42వేల కోట్ల అంచనాలతో , 26 ప్యాకేజిలుగా ప్రభుత్వం చేపట్టింది.తొలి దశలో 9 నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తునారు .
ప్రాజెక్టు రూపకల్పన : తెలంగాణాలో పారుతున్న 2జివనదులైన కృష్ణా,గోదావరి జలాలను పుర్హిగా వినియోగించుకొనే విధంగా వాటర్ గ్రిడ్ను రుపొందిచాదమైనది. గోదావరి నుంచి 40.20 టి ఎం సి ల నీటిని ,కృష్ణా నది నుండి 29.86 టి ఎం సి ల నీటిని వినియోగిస్తునారు . శ్రిశైలం ప్రాజెక్ట్ ,శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ , కొమురం భీం ప్రాజెక్ట్ ,పాలేరు రిజర్వాయరు , జూరాల డ్యాం ,నిజాంసాగర్ ప్రాజెక్ట్ ల నీటిని వినియోగించుకోడానికి ప్రణాళికలు రూపొందించారు . శాస్త్రీయంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ఎత్త్తు పల్లాలను వినియోగిస్తూ లేదా అవసరమైన చోట నీటిని పంపు చేస్తూ పైపు లైన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది
ప్రాజెక్టు ప్రధాన పైపులైన్ల 5,000కిలోమీటర్లు వరకు ఉంటాయి . మాధ్యమిక పైపులైన్లు 50,000 కిలోమీటర్ల వరకు ఉంటాయి ,జనావాసాల సర్విస్ ట్యాంకులను నింపడానికి ఉపయోగపడుతాయి . ఇక్కడి నుండి 75,000 కిలోమీటర్ల గ్రామస్థాయి పైపులన్ నెట్ వర్క్ శుబ్రమైన నీటిని అందిస్తుంది . రాష్టస్తాయి గ్రిడ్ లో మెత్తం 26 అంతర్గత గ్రిడ్ లు ఉంటాయి .
ప్రాజెక్ట్ వివరాలు : వాటర్ గ్రిడ్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తుంది . వాటర్ గ్రిడ్ పూర్తి సర్వ్ కోసం అద్వాన్సుడ్ లైట్ డిటెక్షన్ అండ్ రేజింగ్ (LIDER ) టెక్నాలజీతోపాటు లైట్ వెయిట్ ఎయిర్ క్రాప్ట్ ను కుడా వినియోగిస్తునారు
నిటి సరఫరాలో ఎటువంటి సమస్య వచ్చిన సర్జ్ ఎనాలసిస్ ,స్మార్ట్ ప్లో వంటి సాప్ట్ వేర్ టెక్నాలజీతో త్వరితగతిన పరిష్కారిస్తారు . ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావ్ గారు సిస్టం కంట్రోల్ అండ్ డేటా యాక్సిస్ (SCDA) టెక్నాలజీ ద్వారా సెక్రటేరియట్ నుంచి స్వయంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను సమిక్షిస్తారు
ప్రాజెక్ట్ నిర్మాణంలో అంతర్జాతియ ప్రమాణాలను పాటిస్తుంది తెలంగాణా రాష్ట ప్రభుత్వం . వనరుల సమీకరణ సమన్వయం కొరకు ప్రాజెక్ట్ నిర్మాణ , నిర్వహణ భాద్యతలను ఒక్కరికే అప్పజెప్పి విధానం అమలుచేస్తుంది .
మిషిన్ కాకతీయ
• భూమిని పచ్చగా చేసే పవిత్ర కార్యక్రమం మిషిన్ కాకతీయ .
• చెరువులను పునరుద్ధరించే లక్ష్యంతో మిషిన్ కాకతీయ పధకం ప్రారంభించబడింది
• 2015 మార్చి 12 న నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సదాశివనగర్ పాతచేరువు పునర్దదరణ ఈ పధకంను ముఖ్యమంత్రి కేసిర్ ప్రారంభించారు .
• మిషిన్ కాకతీయ వెబ్ సైట్ ను 2015 జూన్ 4న ప్రారంభించారు .
• “మన ఉరు -మన చెరువు “ నినాదంతో రాష్టంలో మెత్తం 46,531చెరువులను పునరుద్దరించాలిని నిర్ణయించారు .
• ఈ చెరువుల పునరుద్దరణ వలన 10 .17 లక్షల హెక్టార్లకు సాగునీటి వసతి కల్పించబడుతుంది .
• మెత్తం చెరువులలో గోదావరి బేసిన్లో 23,497చెరువుల ,కృష్ణా బేసిన్లో 22,950చెరువులు ఉన్నాయి .
• వర్షపు నిటి నిల్వ ద్వారా కరువును నివారిచడం భూగర్బ జలాలను పరిరక్షించడం , చెరువుల పారకం ద్వారా విధ్యుత్ వినియోగం గణనీయంగా త్తగ్గించడం
• సంవత్సరానికి 9,306చెరువుల చొప్పున 5 ఏళ్లలో 46,531చెరువుల పునరుద్దరణ లక్ష్యం .
• 2015ఏప్రిల్ 17నాటికి 3008చెరువుల్లో మెదటి దశ మిషిన్ కాకతీయ పనులు ప్రారంభమయ్యాయి .
• 2016మార్చి 24న వరంగల్ జిల్లాలోని హన్మకొండలోని పద్మాక్షమ్మ గుండం వద్ద మిషిన్ కాకతీయ రెండవ దశ పనులను తెలంగాణ రాష్ట భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావ్ ప్రారంభించారు .
• మిషిన్ కాకతీయ మెదటిదశలో వరంగల్ ప్రధమ స్థానములో నిలిచింది
• మిషిన్ కాకతీయ రెండో దశలో వరంగల్ జిల్లలో 824 చెరువులకు రూ .313కోట్లు మంజూరు అయ్యాయి .
• 2016-17బడ్జెట్ లో మిషిన్ కాకతియకు రూ .2543.52 కోట్లు కేటాయించారు .
ఆసరా పెన్షన్ పధకం
ప్రభుత్వం సాంఘిక భద్రత , సంక్షేమ దృష్ట్యా20 14 నవంబర్ 8న ఆసరా పధకాన్ని ప్రారంభించింది .
రాష్ట వ్యాప్తంగా 2014 డిసెంబర్ 10 నుండి అమలులోకి వచ్చింది .
• ఈ పధకాన్నిమొట్టమెదటగా మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామములో ముఖ్యమంత్రి కే . చంద్రశేఖర్ రావ్ ప్రారంభించారు .
• ఈ పధకం కింద వృద్దులకు,వితంతువులకు ,చేనేత ,మరనేత కార్మికులకు ,కళ్ళు గీత కార్మికులకు,ఏడ్స్ బాదితులకు రూ 1000 ,వికలాంగులకు రూ.1,500 చొప్పున ప్రతి నెల చెల్లిస్తారు
• 2015మార్చి నుండి మహిళా బిడి కార్మికులకు ఆర్దిక సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ పథకం కింద వారికీ రూ,1000 జీవన భ్రుతి కల్పించింది
• ఈ పథకం అమలులో బాగంగా వృద్దులు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్ రోగులకు గులాబీ కార్డులు, వితంవులకు నీలం కార్డలు, వికలాంగులకు లేత ఆకుపచ్చ రంగుల్లో ముద్రించిన కార్దులు అందజేస్తారు.
• ప్రస్తుతం ప్రతినెలా 35,73,777 మంది లబ్దిదారులు ఈ పతకం ద్వార లబ్ది పొందుతున్నారు .
• గ్రామీనాబివ్రుద్ది శాఖ అదీనములొ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్ ) ఈ పించన్లు పంపిణి చేస్తుంది.

కళ్యాణలక్ష్మి పథకం

• ఎస్.సి.,ఎస్.టి.లలో ఆర్దికంగా వెనుకబడిన కుటుంబాలలో మహిళల వివాహానికి సహాయం అందించే ఉద్దేశంతో కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభమైంది.
• ఈ పథకాన్నిముఖ్యమంత్రి కే.సి.ఆర్. హైదరాబాదులో 2014, అక్టోబర్ 2న ప్రారంబించారు.
• 2 లక్షల లోపు ఆదాయం కల కుటుంబాలలో యువతుల వివాహ సమయంలో రూ.51 వేల నగదును అందజేస్తారు.
• తెల్ల రేషన్ కార్డు కలిగి పట్టణాల్లో రూ.2 లక్షలు , గ్రామాల్లో రూ .లక్షన్నర వార్షికాదాయం మించిన ఈబిసిలతో పాటు, బీసి లకు 2016 ఏప్రిల్ నుంచి “కల్యాణలక్ష్మి” ని వర్తింపచేస్తున్నారు.
• ఎస్,సి , ఎస్.టి.లకు కళ్యాణలక్ష్మి ని ఎస్సి,సి ఎస్,టి శాఖలు, బిసి లకు బిసి సంక్షేమ శాఖ పర్యవేక్షణలో నిర్వహిస్తారు.
• 2015 -16 బడ్జెట్ లో ఈపథకం కింద రూ .330 కోట్లు కేటాయించగా 2016-17 బడ్జెట్ లో రూ .738 కోట్లు కేటాయించారు.

షాదీ ముబారక్

• నిరుపేద ముస్లిం కుటుంబాల్లో యువతుల వివాహానికి వారి కుటుంబ ఆర్దిక బారాన్ని తగ్గించడానికి 2014, అక్టోబర్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం “షాదీ ముభారక్” పథకాన్ని ప్రవేశపెట్టింది.
• ఈ పథకం కింద మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా , వివాహానికి కనీసం నేలముందు దరఖాస్తు చేసుకునే ప్రతీ మైనారిటి బాలికకు ఒకే ఒకసారి రూ.51,000 ఆర్దిక సహాయాన్ని ఇస్తారు.
• ఈ పథకంలో బాగంగా హెల్ప్ లైన్ నం .040-24760452 నవంబర్ 10, 2014 నుండి అమలులోకి వచ్చింది
• ఈ పథకం కింద లబ్దిపొందే యువతులు 18క్ ఏళ్ళు , ఆపై వయస్సు కలగి , తెలంగాణా ప్రాంతానికి చెందిన మైనారిటి వర్గం వారై వుండాలి వధువు తండ్రి వార్షికాదాయము రూ 2 లక్షలకు లోపు వుండాలి
• 2016 – 17 బడ్జట్ లో ఈ పథకానికి గాను రూ .150 కోట్లు కేటాయించారు
.
ఆరోగ్య లక్ష్మి

• తెలంగాణా రాష్టం లో ప్రతి తల్లి ,బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వారికి పౌష్టికాహారం అందిచదానికి 2015 , జనవరి 1 నుంచి ఆరోగ్య లక్ష్మి అనే పథకాన్ని ముఖ్యమంత్రి కే .సి ర్ . ప్రారంభించారు .
• రాష్ట వ్యాప్తంగా అంగన్ వాడి కేంద్రాలు , మినీ అంగన్ వాడి ల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్సారు
• గర్భిణులకు బిడ్డలకు పాలిస్తున్న తల్లులకు ఒక పూర్తి భోజనముతో పాటు గుడ్డు ,పప్పు ,200 మీ.లి. పాలు అందిస్తారు .వీటిని బిడ్డకి 3 సంవత్సరాలు ,తల్లికి 7 నెలలపాటు అందిస్తారు .
• గతంలో ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో ఈ పథకం కొనసాగేది .ఇప్పుడు బాలింతలకు , గర్భిణ లకు ఒక పూట మధ్యాహ్నభోజన పాథకంగా మార్చారు .
బిసిలు ,ఈబీసీలకూ కళ్యాణలక్ష్మి
తెలంగాణాలో ప్రస్తుతం ఏస్ సి, ఎస్ టి లకు అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి పథకాన్ని వెనుకబడిన తరుగతులు ఆర్దికంగా వెనుకబడిన తరుగతులకు అమలు చేసందుకు ఆదేశిస్తూ రాష్ట పప్రభుత్వం 2016 ఏప్రిల్ 21 న ఉతర్వులు జారీ చేసింది . ఒక్కో వధువుకు రూ 51 వేల సాయం అందించే ఈ పథకం 2016ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుందిని అందులో పేర్కొంది . తెలంగాణాలో నివసించే బీసీ ,ఈ బీ సీ వర్గాలకు చెందిన 18 ఏళ్ళు దాటిన వధువులు మాత్రమే ఈ పథకానికి అర్హులు తల్లిదండ్రుల వార్షికాదాయం రూ .రెండు లక్షల వరకు గల వారికే ఇది వర్తిస్తుంది .

హరితహారానికి శ్రీకారం

• *తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజనవర్గంలోని చిలుకూరులో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావ్ 2015 జూలై ౩న ప్రారంభించారు కోతులు వాపసుపోవలి , వానలు వాపసు రావాలి అన్న నినాదంతో ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు వచ్చే మూడేళ్ళలో రాష్టము లో దాదాపు 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది . తెలంగాణా లో హరితహారం కార్యక్రమం జూలై 3 నుంచి 10 వరకు కొనసాగింది మానవ చరిత్రలో చైనా , బ్రెజిల్ తర్వాత ఇన్ని కోట్ల మొక్కలు నాటడం ఇది అతిపెద్ద ప్రయత్నం దేశంలో చేపట్టిన కార్యక్రమాలో హరితహారం మెదటి అతిపెద్ద హరితహారం కోసం గ్రామిణాబివ్రుద్ది శాఖ నుంచి రూ .550 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొనారు .
• రాజీవ్ విద్యమిషిన్ పేరు మార్పు
• తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం రాజీవ్ విధ్యామిషిన్ పేరును తెలంగాణా సర్వ శిక్ష అభినయ్ గా పేరు మార్చింది .
• గతంలో కేంద్రం ప్రాధమిక విద్య అభివృదికి అమలుచేస్తున్న సర్వశిక్ష అభినయ్న్ పేరును వైఎస్ ర్ ప్రభుత్వం రాజీవ్ విద్య మిషిన్ గా మార్చింది .
• సద్దిమూట

• మార్కెట్ యార్డులో రూ 5కే భోజనం అందించే సద్దిమూట కార్యక్రమాన్ని 20 14 ,ఆక్టోబర్ 13 న నిటి పారుదల శాఖ మంత్రి టి హరీష్ రావ్ ప్రారంభించారు .
• దీనిని మెదటగా మెదక్ జిల్లా సిద్ధిపేట మార్కట్ యార్డ్ లో ప్రారంభించారు .
• ఈ పథాకాన్ని మెదట సుభోజనం పథకంగా అమలు చేయడం జరిగింది

• భోజనామృతం

• మాతా శిశు సంరక్షణ ,ప్రాంతీయ అసుపత్రుల్లో రోగుల సహాయకులకు భోజనం ఉచితంగా అందించే ఉద్దేశంతో భోజనామృతం కార్యక్రమాన్ని 2014 , ఆక్టోబర్ 13న ప్రారంభించారు .
• ఈ పథాకాన్ని మెదటగా మెదక్ జిల్లాలోని సిద్దిపేట్ జిల్లాలోని సిద్దిపేట్ లో టి . హరీష్ రావ్ ప్రారంభిచారు .

గ్రామజ్యోతి

* గ్రామాల సర్వోతముఖాబివ్రుద్దికి తోడ్పడే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే.సి.ర్ ప్రారంభించారు.
* 2015 , ఆగస్టు 17న ఈ పథకం మెట్ట మెదటగా వరంగల్ జిల్లా గంగాదేవిపల్లి గ్రామంలో ప్రారంభమైనది.
రాష్ట్రములోని ప్రతి గ్రామం స్వయంపాలనతో స్వయం సమృద్ధి సాధించాలన్నదే గ్రామజ్యోతి లక్ష్యం .
ఈ కార్యక్రమం ద్వారా పంచాయితీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయుడం , గ్రామ పంచాయితీలను క్రియాశీలంగా మార్చడం , గ్రామాస్తాయిలోనే ఆభివృద్ధి ప్రణాళికలు రూపొందిచడం, అమలుచేయడం వంటి చర్యలు చేపడుతారు .
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం 7 కమిటిలను ఏర్పాటు చేస్తుంది .
పారిశుధ్యం , తాగునీరు , ఆరోగ్యం ,పౌష్టికాహారం , విద్య వ్యవసాయం ,సామాజిక భద్రత – పేదరికం నిర్మూలన , సహజవనరుల నిర్వహణ , మౌలిక సదుపాయాల కమిటిలను నియమిస్తారు .

నిర్వహణ కమిటి అనుసరించాల్సిన పద్దతులు
• వివిధ శాఖల ప్రతినిధుల నుంచి కార్యక్రమాల అమలు కోసం అవసరమైన వివారాలు సేకరించడం
• సేవల తాజా పరిస్థుతుల పై సమీక్షలు
• గ్రామ పరిస్తులను తనిఖీ చేయాలి . పరిస్థులకు అనుగుణంగా విశ్లేషించాలి .
• వనరుల లభ్యత పై సమిక్షిచుకోవడం
• ప్రణాళిక సిద్దం చేయడం , వనరులను కేటాయించడం ,ఫలితాలపై గ్రామసభ ఆమోదం తీసుకోవడం .
జాతీయ అంబులెన్స్ సేవల పథకంలో 108 వాహన సేవలు
• 108 వాహన సేవలను జాతీయ అంబులెన్స్ సేవల పథకం పరిథిలోకి మారుస్తూ తెలంగాణ సర్కార్ 2014 , నవంబర్ 28న ఉత్తర్వులు జారి చేసింది
• ప్రస్తుతం ఈ సేవల నిర్వహణ , పరిశోధనా సంస్త పథకం కింద కొనసాగుతాయి .
• తెలంగాణాలో ప్రస్తుతం పనిచేస్తున్న 108 వాహనాల ,సంఖ్య 316 .
• జాతీయ అబులేన్స్ పథకంలోకి మారడంవల్ల అంబులెన్స్ల నిర్వహణ ఖర్చులో 25 శాతాన్ని ఎన్ హెచ్ ఎం భరిస్తుంది .
మన ఊరు – మన కూరగాయలు
• మన ఊరు – మన కూరగాయలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే.సి .ర్ మెదక్ జిల్లలో 2014 , ఆగస్టు 6న ప్రారంభించారు .
• కూరగాయల ఉత్పత్తి పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది .
• హైబ్రిడ్ కూరగాయల విత్తనాలు ,శాశ్వత పాండల్స్ , షెడ్ నెట్ లు అందిచటం , సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య విధి .
• హైదరాబాద్ మార్కెట్ కు ప్రధాన సరఫరా ధారులైన ఇతర జిల్లాలోని మార్కెట్ లింకేజిలను కలపడం .
• తెలంగాణ సాగుబడి పథకం
• వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రైతుల కోసం ఈ పథకాన్ని రూపోందించారు .
• వ్యవసాయాభివృద్దికి ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై రైతులందరికీ అవగహన కల్పించాలన్నది ఈ పథకం ముఖ్యోదేశం .
• పంట భీమా ,పంట రుణాలు తదితర పథకాలు ఎలా వినియోగిచుకోవాలన్న దానిపై రైతులకు శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తారు .
• తెలంగాణా సాగుబడి పథకానికి సంభందిచిన శిక్షణా కార్యక్రమాలను 2015 ,జనవరి 5న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు .
• సంచార శుద్ధి నిటి సాగుబడి పథకం

• తెలంగాణ రాష్టములోనే తొలిసారిగా మెదక్ జిల్లా సిద్దిపేటలో సంచార శుద్ధి నిటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు .
• ఈ పథకాన్ని2014 , డిసెంబర్ 1 న రాష్ట భారి నిటిపారుధలశాఖ మంత్రి టి.హరీష్ రావు ప్రారంభించారు .
• 20 లీటర్ల శుద్ధి చేసిన మంచినీటిని ఇంటివద్దకు వచ్చి అందిచటం ఈ పథకం ప్రాధాన లక్ష్యం .
• భూమి కొనుగోలు పథకం
• తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రధానమైన పథకం భూమి కొనుగోలు పథకం .
• ఈ పథకాన్ని 2014 ,ఆగస్టు 15న ముఖ్యమంత్రి కెసిఆర్ . గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య వేడుకలలో ప్రారంభినచారు .
• ఈ పథకంలో భాగంగా షెడ్యుల్ కులాల మహిలలో అత్యంత పేద వారికి 3 ఎకరాల చొప్పున ఉచితంగా భూమి పంపిణి చేస్తారు .
• ఈ భూమి కొనుగోలుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది .
• ఇలా కేటాయించే భూమిలో పంటలను వేయటానికి అయ్యే మెత్తం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది .
• ఎరువులను , విత్తనాలను సేద్యపు జలాలను ప్రభుత్వమే సమకూర్చి వీటికి అయ్యే ఖర్చును లబ్దిదారుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు .

సన్నబియ్యం పథకం

• సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యర్థులకి పౌష్టికాహారం అందిచే ఉద్దేశంతో ప్రారంభించబడింది .
• ఈ పథకం 2015 జనవరి 1న ప్రారంభమైంది .
• ఈ పథకం కింద హాస్టళ్ళకి 1 రూ కే కిలో సన్నబియ్యం సరఫరా చేయడం ప్రత్యేక .

రైతు రుణ మాఫీ పథకం

• తెలంగాణ రాష్ట ప్రభుత్వ రైతులు తీసుకున్న రుణాలు రూ .లక్ష వరకు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది .
• 2015 -16 లో రాష్ట బడ్జెట్ లో రుణమాఫీకి రూ .4500 కోట్లు కేటాయించబడింది
• తెలంగాణలో రుణ రైతుల శాతం 80 శాతం పైగా ఉన్నట్టు రాధాకృష్ణ కమిటి పేర్కొంది .

పెంటావలేంట్ టికా కార్యక్రమం

• సార్వత్రిక ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 2015, జూన్ 3న పెంటాలేవంట్ వ్యాక్సిన్ కార్యాక్రమాన్ని ప్రారంభించింది .
• హైద్రాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కాలేజిలో ఆరోగ్య శాఖామంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు .
• రాష్ట వ్యాప్తముంగా ఉన్న దాదాపు 700 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు , 5 వేల ప్రాథమిక ఉప – కేంద్రాలు ,బోధన ఆసుపత్రులు , తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆసుపత్రుల ద్వారా ఈ వ్యాక్సిన్ ను ఉచితంగా పిల్లలకు వేస్తారు .
• ఈ వ్యాక్సిన్ కంట సర్పి ,కోరింతదగ్గు , ధనుర్వాతం ,హెపటైటిస్ -బి హేమోపిలాస్ ఇన్ ప్లూయోజా-బి అనే ఐదు రకాల ప్రాణంతక వ్యాదుల నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తుంది .

• రెండు పడక గదుల ఇళ్ళ పథకం

• ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణ పథకానికి ముఖ్యమంత్రి కెసిఆర్ .2015 ఆక్టోబర్22 న నల్గొండ జిల్లా సూర్యాపేట ,మెదక్ జిల్లా ఎర్రవల్లి , నర్సన్న పేటలలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు .
• ఈ పథకం కింద ఇళ్ళను 560 చ.అడుగుల్లో నిర్మిచాలని , ఒక్కో ఇంట్లో రెండు బెడ్ రూమ్లు హాలు ,వంట గదితో పాటు రెండు మరుగుదొడ్లు నిర్మిచనున్నారు .
• ఈ పథకానికి అర్హులుగా ఉండువారు ఆహార భద్రతా కార్డును కలిగి వుండాలి . మహిళ పేరిట ఇంటిని మంజూరు చేస్తారు .
• గ్రామీణ ప్రాంతలో ఎస్ .సి.లకు 17 శాతం ఎస్ టి లకు 6 శాతం అల్ప సంఖ్యాక వర్గాలకు 12 శాతం . మిగిలిన ఇతరులకు కేటాయిస్తారు .
• ఈ పథకం కింద రాష్ట వ్యాప్తంగా రెండు లక్షల ఇండ్లను నిర్మించి రూ .860 .37 కోట్లు కేటాయించారు .
• 2015లో 60 వెల ఇళ్లు మంజూరు చేయగా , 2016 -17 లో జిహెచ్ఎంసి పరిదిలో 60 వేలు , పట్టణ ప్రాంతాల్లో 40 వేలు నిర్మిచనున్నారు .
• జర్నలిస్టులకు సహాయనిధి

• రాష్ట్ర ప్రభుత్వంజర్నలిస్టుల సహాయనిధి పథకాన్ని 2015 , ఫిబ్రవరి 23న హైదరాబాద్ లో ప్రారంభించిది .
• సమాజంలో జరుగుతున్న విషయాలను వేగంగా ప్రజలకు అందిచడంలో అహర్నిశలు పాటుపడే జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ పథకం ఏర్పాటు చేయబడింది .
• ఈ పథకానికి కేటాయించబడిన మొత్తాన్ని ఫిక్సిడ్ డిపాజిట్ చేసి దాని పై వచ్చే వడ్డిని జర్నలిస్టుల సహాయ సంక్షేమానికి ఉపయోగిస్తారు .

స్త్రీ నిది

• పేదవారి ఆదాయం పెంచడానికి జీవనోపాధిని కల్పించడానికి చేపట్టే చర్యలను స్త్రినిది పథకం ద్వారా చేపడుతారు .
• తెలంగాణలో ఉన్న స్వయం సహాయక బృందాల 426 మండల సమాఖ్య లిమిటెడ్ ను ప్రారంభించాయి .
• జలహారం
• రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్లోరైడ్ రహిత సురక్షిత మంచినీటి అందించాలనే లక్ష్యంతో పథకాన్నిఏర్పాటు చేసారు .
• తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ గా పిలిచే ఈ కార్యక్రమాన్ని 2015 ,జూన్ 8న ముఖ్యమంత్రి కెసిఆర్ . నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో ప్రారంభించారు .
• ఈ పథకం ద్వారా ప్రతి వినియోగదారునికి గ్రామాల్లో 100 లి , పట్టణాలో 135 లి , మహానగరాల్లో 150 లీటర్ల నీటిని అందిస్తారు .
• ఈ పథకానికి కేంద్రప్రభుత్వం హుడ్కో అవార్డ్ లభించింది .


ఆపరేషన్ ముష్కాన్

• తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకొని వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన పథకం
• 2015 , జనవరి 29న హైదరాబాద్ లో ఈ పథకం ప్రారంభమైంది .
• ఈ కార్యక్రమం కింద హైదరాబాద్ పరిదిలో గాజుల పరిశ్రమల పై దాడి చేసి 216 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు .
• ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలిస్ స్టేషన్ పరిధి నుండి తప్పిపోయిన పిల్లలను వెతికిపట్టుకున్న సంఘటన స్పూర్తితో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది .

షి బృందాలు

• తెలంగాణ రాష్ట్ర పోలిస్ శాఖ హైదరాబాదులో మొట్టమొదటిసారిగా మహిళల భద్రతకై షి బృందాలు అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది .
• 2014 ,ఆక్టోబర్ 24న హైదరాబాద్ లో 100 షి టిమ్స్ ను ఏర్పాటు చేసింది .
• ఈ బృందాలు ముఖ్య లక్ష్యం పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల పై జరిగే లైంగిక వేదింపులను నిరోధించడం .
• షి టిమ్స్ టోల్ ఫ్రీ డయల్ నం 100 గా అనుసంధానం చేశారు .


24 /7 మహిళల హెల్ప్ లైన్

• రాష్ట్రములో మహిళా భద్రత , మహిళలకు సంభందించిన సమస్యల పరిష్కారం కొరకు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు .
• మహిళలపై జరిగే హింసను అరికట్టే పథకాలు లేదా చర్యలకు మద్దతు అందించే లక్ష్యంతో 24 గంటల తక్షణ సేవలు అందిస్తారు
• మహిళల హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 181
• ఈ పథకంలో భాగంగా షి ఆటోలు , షి టాక్సీలు ,షి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది .

నూతన మద్యం విధానం
• నూతన మద్యం విధానానికి ముఖ్యమంత్రి కెసిఆర్ 2015 , సెప్టెంబర్ 6న ఆమోద ముద్ర వేశారు .
• ఈ విధానానికి 2010 జనాభానే ప్రాతిపదికగా తిసుకున్నారు .
• ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తనంగా 2216 నోటిపైడ్ మద్యం దుకానలున్నాయి .
• సగటున 16 వేల జనాభాకు ఒక వైన్ షాపు ఉంది
• ప్రస్తుతం అమలులో ఉన్న 6 స్లాబుల విధానములోనే దరఖాస్తులను ఆహ్వానించి లాటరి విధానంలో లైసెన్స్ లను కేటాయించారు
• ప్రతి దరఖాస్తుతో పాటు పాన్ కార్డ్ , ఆధార్ నకలును జతపర్చాలి నిభందనలో పేర్కొన్నారు .