తెలంగాణ

తెలంగాణ ప్రత్యేకతలు & పండుగలు

తెలంగాణ రాష్టము దక్షిణ భారతదేశంలో గోండ్వానా శిలలపై దక్కన్ పిటభూమిలో ఉంది . అనాదిగా ఇది వైవిద్యం సంస్కృతి, కళలకు ప్రసద్ది చెందింది

కళలు :
హస్తకళలు : భారతీయ హస్తకళల్లో తెలంగాణ చేతి వృత్తులకు విశిష్ట స్థానం ఉంది వస్త్ర పరిశ్రమ , లోహ ,గృహోపకరణాలు , విలస వస్తువులు ఆటబొమ్మలు ,శిల్పం ,చిత్రలేఖనం లాంటివాటిలో విభిన్న హస్తకళా స్వరూపాలు తెలంగాణా ప్రాంతములో ప్రాచిన కాలములోనే చేనేత కళ అత్యంత ప్రాచుర్యం పొందింది అని చెప్పవచ్చు . నాటి విదేశీ రచయితలు అయ్యిన పిన్లి మరియు ఇతర యాత్రికుల రచనల వల్లశాతవాహనుల కాలం నుండే ఇక్కడి నుండి రోమ్ కు సన్నని పట్టు వస్త్రాలు , సాలెగూడు లాంటి వస్త్రాలు ఎగుమతి అయ్యేవని తెలుస్తుంది ఆ తర్వాత కాకతీయులు కాలములో రాజ్యాన్ని సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్పోలో ఈ ప్రాంతములోని చేనేత , వస్త్రకళ నైపుణ్యాని మెచ్చుకొని వాటి వశిష్టతలను గూర్చి తన గ్రంధములో సమగ్రంగా వివరించడం జరిగింది . ఆ తరువాత పాల్కురికి సోమన కూడా తన పండిత్యరద్య చరిత్రలో 50 రకాల వస్త్రాలను గూర్చి ప్రస్తావించాడు ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహి , అసప్ జాహీల పాలనలో కుడా తెలంగాణలో చేనేత పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందిని చెప్పవచ్చు .
చేనేత వస్త్రాలు : చేనేత వస్త్రాలు వుండిదేశ విదేశ ప్రముకులను ఎంతగానో ఆకర్షించి ప్రశంసలను అందుకుంటున్నా యి నల్గొండ జిల్లా లోని పోచంపల్లి ప్రత్యేక డిసైన్ తో చేసిన నేత వస్త్రాలకు ప్రసిద్ది దీనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వుంది నారయణపేట , గద్వాల , కొత్త పేట మొదలైన ప్రాంతాలలో ప్రపంచ ప్రఖ్యాత చేనేత పట్టు వస్త్రాలను తయారుచెస్తునారు వరంగల్ రగ్గులు , కంబళ్ళ తయారికి ప్రసిద్ది చెందింది పోచంపల్లి చుట్టూ పక్కల ప్రాంతాలు అయ్యిన కోయలగుడేం ,సిరిపురం , రమ్మన పేట , పుట్టుపాక , గట్టుపల , తెరటుపల్ల్లి , చండూర్ ప్రాంతాలలోని వేలాది మంది కార్మికులు పోచంపల్లి చీరలు , పట్టు చీరలకు ఖ్యాతి తెచ్చి పెట్టారు . పుట్టుపాక లోని నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలను రూపొందించి తెలంగాణా విశిష్టతను ప్రపంచమంత చాటారు .
అద్దకం పరిశ్రమ : మెదక్ అద్దకం వస్త్రాలకు దేశంతో పాటు అంతర్జాతీయంగా మంచి గిరాకి వుంది ఒక ప్రత్యేక కళగా ఇది అభివృద్ధి చెందింది ఒకే చిత్రంలో అనేక రంగులు అద్దడమే దిని ప్రత్యేకత .
బొమ్మలు –ఆట వస్తువులు : ఆదిలాబాద్ జిల్లా లోని నిర్మల్ పట్టణంలో రూపొందించే బొమ్మలు రాష్టము లోనే అత్యంత ప్రసిద్ది చెందాయి నిర్మల్ బొమ్మల తయారీలో బురుగు , పొనుకు కర్ర ఉపయోగిస్తారు వీటితో అందమైన లాంతరు స్థంబాలు , ఫర్నిచర్ తరు చేస్తున్నారు ఎటికోప్పాకలో పన్నీర్ బుడ్లు , చదరంగపు బల్లలు , పిల్లలకు పనికి వచ్చే లక్కపిడతలు మొదలైనవాటిని విభిన్న ఆకృతుల్లో తయారు చేస్తున్నారు వీటికి అంకుడు , గిరిమల్లి కర్రలను వినియోగిస్తారు
లేసు అల్లికల పరిశ్రమ : ఖమ్మం జిల్లా దుమ్మగూడెం లేసు అల్లికల పరిశ్రమకు ప్రసిద్ది . క్రైస్తవ మిషినరి ల ద్వారా మనదేశంలో ఈ కళ వ్యాపించింది . సూది నూలు దారం దీని సాదనము . వీటితో నిర్ణిత ఆకారాల్లో అల్లుతారు . పరికిణిల అంచులకు , కిటికీ తెరలకు టేబుల్ వస్త్రాలకు ఉపయోగిస్తారు .
కంచు –ఇత్తడి –రాగి వస్తువులు : తెలంగాణాలో పానగల్ , పెంబర్తి , కురనపల్లి , పరకాల , సిద్ధిపేట లాంటి ప్రాంతాలు లోహాలతో రుపొందిచే తయారికి ప్రసిద్ది చెందాయి ఇత్తడి కంచు ఉత్పతుల తయారీలో ఇక్కడి కళాకారులు సిద్దహస్తులు . ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ , నిజామబాద్ జిల్లాలోని ఇందురులో ఇనుము , ఉక్కు , ఆయుద పరిశ్రమలున్నాయి . కుతుబ్ షాహీల కాలంలోనే నిర్మల్ లో తయారైన కత్తులు డమాస్కస్ దేశానికి ఎగుమతి అయ్యేవి . ప్రపంచ ప్రసిద్ది చెందిన ఈ కత్తుల తయారీలో గోల్కొండ ఉక్కు ఉపయోగించినట్లు తెలుస్తుంది .
పూసల పరిశ్రమ : స్త్రీల నల్లపూసల , పశువుల మెడల అలంకారంగా ఉపయోగించే పూసల తయారికి పాపానాయుడుపేట ప్రసిద్ది చెందింది . ఫిరోజ్ బాద్ నుంచి దిగుమతి చేసుకునే ప్రత్యేకమైన గాజు రాయిని కరిగించి ఈ పూసలను చేతితోనే తయారు చేస్తారు .తెలంగాణా చరిత్రలోనే మెదటి నుంచి వజ్ర పరిశ్రమకు గోల్కొండ ప్రసిద్ది చెందిన ప్రాంతము అని చెప్పవచ్చు .కాకతీయులు ,,కుతుబ్ షాహిల కాలం నుంచే గోల్కొండ ప్రాతం విలువైన వజ్ర సంపదకు ప్రసిద్ది ఈ ప్రాంతములోని గనుల్లో దాదాపు 60 వేల మందికి పైగా కార్మికులు పనిచేసినట్లు చరిత్రకారులు భావన . ఇక్కడి కార్వాన్ ప్రాంతములో వజ్రాలకు మెరుగులు పెట్టె పరిశ్రమ కొనసాగింది అదే విధంగా ముత్యాల పరిశ్రమలు కూడా హైదరాబాద్ ప్రపంచ ప్రసిద్ది చెందిది ఇక్కడి గుల్జార్ హౌస్ , పత్తర్ గట్టి చరకమాన్ ప్రాంతాలు ముత్యాల వర్తకానికి పేరుపొందాయి . హెదరాబాది ముత్యాల దేశ విదేశాల్లో సైతం విశేషంగా ప్రాచుర్యం పొందాయి . అదే విధంగా గాజుల తయారికి హైదరాబాద్ లోని చార్మినార్ , లాడ్ బజార్లు ప్రసిద్ది .
వెండి నగిషి పనులు : కరీంనగర్ జిల్లాలో వెండి నగిషి పని నాణ్యమైనది . ఇది అతి ప్రాచీనమైన చేతి పని సన్నని వెండి తీగల అల్లికలతో డిజైన్లు తయారు చేస్తారు యష్ ట్రైలు , తమలపాకుల పెట్టలు , చేతిబోత్తలు , భరిణి లు , పథకాలు గుండిలు మొదలైన అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు .
వడ్రంగి పనులు : ప్రాచిన కాలము నుండే తెలంగాణా ప్రాంతంలో గ్రామీణ ఆర్దిక వ్యవస్థలో వడ్రంగం ప్రధానంమైనది . వ్యవసాయం , అనుభంద రంగాలకు అవసరమయ్యే పరికరాల కోసం కర్రను వినియోగించడం లో వడ్రంగి పనివారు సిద్హహస్తులు . గృహ నిర్మాణానికి కావాల్సిన ఫర్నిచర్ తయారు చేయడం దానితో పాటు చేనేత పని వారికీ పని వస్తువులు అందించడం కుమ్మరి పని వారిది ప్రధాన పాత్రగా చెప్పవచ్చు . దేవాలయాలో ఉపయోగించే పల్లకీలు రధాల తయారీలో తెలంగాణా ప్రాంతం మిక్కిలి ప్రసిద్ది చెందింది .
బీదర్ వస్తువులు : మిశ్రమ ధాతువులును కలిపి రూపొందించె ప్రత్యేకమైన బిద్రి వస్తువులు అందంగా వుంటాయి . ఇది పారశీక దేశానికి చెందిన కళ . దక్కన్ భాహముని సుల్తాన్ల ,కాలములో బిద్రి కళ బాగా ప్రాచుర్యం పొందింది . ఈ కళ కర్ణాటక లోని బీదర్ నుంచి హైదరాబాద్ లోకి ప్రవేశించిది . తుత్తునాగం , రాగి తదితర ధాతువులను కలిపి మిశ్రమ లోహముతో నిటికుజాలు , హుక్కాలు , పరిమళ వస్తువులు పెట్టెలు భరిణి లు , పులసజ్జలు రుపోదిస్తారు . ఈ మిశ్రమ లోహం తుప్పు పట్టదు .

బతుకమ్మ పండుగ
* తెలంగాణా ప్రాంతములో మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ‘పండుగ’. యావత్ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అతి ముఖ్యమైన పండుగ ఇది .
• 20 14 , జూన్ 16న రాష్ట ప్రభుత్వం ‘బతుకమ్మ’ పండుగను రాష్ట పండుగగా ప్రకటించింది .
• బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి రోజున మెదలై అష్టమి వరకు జరుగుతుంది . అనగా వర్షాకాలం మద్యలో నుండి శీతాకాలం సమిపించే రోజులలో వచ్చే ఈ పండుగ కి తెలంగాణాలో లభించే గునుగు {బతుకమ్మ పేర్చడానికి వాడే ముఖ్యమైన పువ్వు } తంగేడు , గుమ్మడి , బంతి ,చామంతి ,నందివర్ధనం , తమర, దోస ,కట్ల ,బ్జిర మెదలైన అనేక రకాల పువ్వులను సేకరించి ఒక పళ్ళెం లోనో, అకులోనో , వెదురు పల్లకిలోనో ఎత్తుగా పేర్చి అందులో పసుపు ముద్దను వుంచి ‘గౌరమ్మ’గా కొలుస్తారు .
• గౌరమ్మ శివుని భార్య పార్వతీదేవికి మరోపేరు కావున మొదటి రోజు శివాలయంలో బతుకమ్మ ఆడుతారు . రెండవ రోజు నుండి చివరి రోజు వరకూ దేవాలయాలు,చెరువుల వద్ద ఉంచి చుట్టూ వలయాకారంగా చేరి బతుకమ్మలు ఆడి నిమజ్జనము చేస్తారు.
బోనాల పండుగ
• నగరాలతోపాటుగా తెలంగాణా రాష్ట్రములో ప్రతి చోట ఆచరించే పండుగలలో ముఖ్యమైన పండుగ “బోనాలు” . ఈ పండుగలో భాగంగా “మహంకాళీ అమ్మవారిని “ ఆరాదిచడం జరుగుతుంది . బోనము అనగా భోజనము లేదా నైవేద్యం అని, అమ్మవారికి సమర్పించు నైవేద్యం అని అర్ధం .
• ఆషాడ మాసంలో జరిగే ఈ పండుగలో భాగంగా మెదటి మరియు చివరి రోజులో “ఎల్లమ్మ దేవికి “ ప్రత్యేక పూజలు చేస్తారు . మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొత్తకుండలో వండిన అన్నంతో పాటు పాలు , బెల్లం కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో వేసి ఆ కుండలను వేప ఆకులు , పసుపు ,కుంకుమలతో అలంకరించి దానిపై దీపం ఉంచి , ఆ కుండను తలపై పెట్టుకొని డప్పులతో అమ్మవారి గుడికి వెళ్లి బోనాన్ని సమర్పిస్తారు .
• బోనాల పండుగ సందర్బంగా మైసమ్మ , పోచమ్మ , ఎల్లమ్మ , పెద్దమ్మ ,డొక్కలమ్మ , అంకాలమ్మ , పోలేరమ్మ ,మారెమ్మ మెదలగు దేవాలయాలను దేదిప్యామానముగా అలంకరిస్తారు
• ఆషాడ మాసంలో దేవి తమ పుట్టింటికి వెళుతుంది అని భక్తుల నమ్మకం కావున భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిదన్న భావనతో భక్తి శ్రద్దలతోనే గాక , ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు . దీనినే “ఉరిడి” అంటారు దీనినే నేడు బోనాలుగా పిలుస్తున్నారు .
• 1800వ ప్రాంతములో హైదరాబాద్ , సికింద్రాబాద్ జంటనగరాలలో ప్లేగు వ్యాది ప్రబలి అనేకులు మరణించారు .
• ఈ ప్రాంతానికి చెందిన కొందరు సైనికులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ఈ వ్యాది నుండి ప్రజలని రక్షిస్తే మా ప్రాంతములో దేవాలయం నిర్మస్తామని కోరుకున్నారు . విరి కోరిక మేరకు అమ్మవారు ఈ వ్యాదుల నుండి ప్రజలని కాపాడారని మొక్కు మేరకు గుడికట్టి ప్రతియేటా ఆషాడ మాసంలో బోనాలు సమ ర్పిచడం ఆనవాయితీగా వస్తూ వుంది
• బోనాల పండుగ గోల్కొండ కోటలోని “ఎల్లమ్మ ఆలయం “ వద్ద మెదలెట్టి సికింద్రాబాద్ లోని “ఉజ్జయిని మహంకాళీ” ఆలయం బల్కం పెట్ లోని ఎల్లమ్మ ఆలయాలు మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరి వారిబలిలోని అక్కన మాదన్న దేవాలయాము వారి ఘటముతో ఏనుగు అంబారి పై , అశ్వాల మద్య , అక్కన , మాదన్న బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి నయా పుల్ వద్ద ఘటముల నిమజ్జనంముతో ముగుస్తుంది ఈ బోనాలను 2014 , జూన్ 16 వ తేదిన తెలంగాణా ప్రభుత్వం రాష్ట పండుగగా ప్రకటించింది .

ఉగాది
చైత్ర శుద్దపాడ్యామి నాడు జరుపుకొనే “ఉగాది “ తెలుగువారి తొలి పండుగ . తెల్లవారగానే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని మామిడికాయ చింతపండు ,బెల్లం ,వేపపూలు ,నిళ్ళు,కొంచెం ఉప్పు కలిపి చేసిన ఉగాది పచ్చడి రుచి చూస్థారు . జీవితం సుఖదుఖాలమయం అనే విషయాన్ని రుచి చూచే పచ్చడిలోని పులుపు చేదు , తీపి వంటి రుచులు సూచిస్తాయి ప్రజలందరూ ఆలయాల వద్దకు చేరుకొని , పండితులు చెప్పే పంచాంగ వివరాలను తెలుసుకొని రాబోయే ఏడాదిపాటు తమ అదృష్టాన్ని , దురదృష్టల్ని , అంచనా వేసుకొంటారు .

శ్రీరామనవమి

శ్రీరామునికి , సీతకి పెండ్లి జరిగిన నవమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు . రాష్టములోని ప్రతి గ్రామం , పట్టణం , నగరాల్లోని రామాలయాల్లో కళ్యాణోత్సవాని ఘనముగా జరుపుతారు . ఖమ్మం జి ల్లలో గోదావరి తోరానగల భద్రాచలములో శశ్రీరామనవమి ఉత్సవాలు ,కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుపుతారు . మర్చి –ఏప్రిల్ మాసాల్లో జరిగే ఈ వేడుకలో ఎంతోమంది భక్త జనంతో పాటు రాష్ట ముఖ్యమంత్రి పాల్గొని ప్రభుత్వం తరుపున పట్టుపితంబ్రలు , ముత్యాల తలంబ్రాలు రాముల వారికి సమర్పించ టం విశేషం కుతుబ్ షాహీ కాలం నుంచి వస్తున్న ఈ ఆనవాయితి ని ప్రభుత్వం ఇప్పటికి పాటించటం సంతోచిన్చాదగ్గ విషయం .

కృష్ణాష్టమి
ఆగస్టు – సెప్టెంబరు మాసాల్లో వచ్చే కృష్ణాష్టమి ఋతుపవనాలరాక సందర్బంగా కొన్ని చోట్ల ఉత్తర భారత సంప్రదాయంలో కృష్ణ –గోపికల కోలాటాన్ని ప్రదర్శిస్తూ , ఉట్లను పగల గొడుతూ రాత్రంతా పాటలు ,భజనలతో కాలం గడుపుతారు . నగర ప్రజల కోసం హైదరాబాద్ లోని శిల్పరామంలో కృష్ణాష్టమి వేడుకల్ని వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో మేళవించి జరుపుతారు

వినాయక చవితి
భాద్రపద శుద్దచవితి నాడు రాష్టమతాంట ఆనోదోత్సవాలతో జరుపుకునే మరో పండుగ “ వినాయక చవితి “ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన గణపతిని , తమ ప్రయత్నాలో గాని అడ్డకులు కల్పించ వద్దని వేడుకొంటు పండుగను జరుపుకుంటారు పొద్దున్నే నిద్రలేచి , స్నానాలు చేసుకొని ఊరు బయటి పొలాల్లో నుంచి 21రకాల ఆకులను తెచ్చి , మట్టితో చేసిన వినాయకుని బొమ్మను ఇంట్లో అందంగా అలకరించి , పూజలు చేస్తారు . విద్యారులు పుస్తకాలను , పెద్దలు పాయసం , వడపప్పు , చలిమిడి ,కుడుములు ఉండ్రాళ్ళు వినాయకుడి ముందు ఉంచి పుజిస్తారు . సాయంత్రము వినాయక వ్రాతకల్పములోని కథను చదివి , అపనిదలు రాకుండా చుచుకొంటారు . ఇటివల ప్రతిచిన్న గ్రామంలో పెద్ద వినాయక విగ్రహము నుంచి ముగిస్తున్నారు హైదరాబాద్ లో కొన్నివేల గణపతి విగ్రహాలను ప్రతిష్టించి , తొమ్మిదవ రోజున ఊరేగింపుగా వెళ్లి హుస్సేన్సాగర్ లో గాని సమీపంలోని చేరువుల్లోగాని నిమజ్జనం చేసి వస్తున్నారు కొన్ని కిలోమీటర్ల పొడువునా సాగే గణేష్ ప్రతిమల ఊరేగింపు రాష్ట ప్రలనేకాక విదేశి పర్యాటకుల్ని సైతం విశేషంగా ఆకటుకొంట్టుంది .

దసరా {విజయదశిమి }
ఆశ్వయుజ మాసంలో తిమ్మిది రోజుల పాటు రాష్టముంతట దసరా లేక దేవి నవరాత్రులు జరుపుతారు . దుర్గ లేక స్త్రీ శక్తి ని మహిషాసుర మర్ధినిగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలతో పుజిస్తారు . దుర్గాష్టమి , మహార్నవమి ,విజయదశమి రోజులో విశేషంగా పుజిస్తారు . మహా భారత , రామాయణ కాలాలనుంచి ఆచారంగా వస్తునట్లు పెరుకొంటున్న దసరా రోజున వరంగల్ భద్రకాళి దేవాలయాములో ఘనంగా ఉత్సవాలను జరుపుతారు . ఆలయాలను రంగురంగుల విద్యత్ ద్దిపాలతో దేవిని అన్ని ఆభరణాలుతోను అలంకరించి చేసే ఉత్సవాలను తిలకించడానికి రాష్టం నలుమూలల నుంచి భక్తులు విపరీతంగా వస్తారు కృష్ణానది జలషయంలోను , భద్రకాళి చేరువులోను జరిగే హంసవహన తెప్పోత్సవం పర్యాటకుల్ని ఆశ్యర్య చకితుల్ని చేస్తుంది . వివిధ రకాల వృత్తి పనివాళ్ళు కార్మికులు , తమతమ పనిముట్లుకు ఈ రోజు పూజలు చేయటం ఆనవాయితీ .వరంగల్ లోని రంగాలిలా మైదానంలో దుష్టసంహారానికి ప్రతీకగా రావణాసురుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి బానాసంచాలతో పెల్చుతారు . ఈ సంబరాలు చూడటానికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు . ఈ సాంప్రదాయం రాష్టంములోని అనేక ఆచారాలతోను నిర్వహించబడుతుంది

దీపావళి
కార్తీకమాసంలో వచ్చే దీపావళిని “ రాష్టములోని ప్రజలంతా వేడుకగా ఆనదోత్సవలతో జరుపుకుంటారు . జీవితాల్లోని చీకట్లను పారదోలి వెలుగులు నింపే ఈ పండుగనాడు , సత్యభామ, నరకాసురుని జయించిదనీ ,జనాన్ని బాధలు పెట్టిన నరకుడు చనిపోయిందుకు అనధంతో దీపాలను వెలిగించి ఉత్సవాన్ని జరుపుకోనడంతో ఈ పండుగ ప్రాంభమైంది ప్రజలు నమ్ముతారు ఉదయం స్నానాలు ముగిసిన తరువాత లక్ష్మీదేవిని పూజించి , సాయంత్రం దీపాలతో ఇళ్ళన్ని అలంకరించుకొని , టపాకాయల మెతల్లో కాకర పువ్వోత్తులను చిచ్చుబుడ్లను వెలిగించుకొని , తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు . పిల్లలు , పెద్దలు పటాసులు పేల్చటానికి పోటిపడుతూ, నవ్వుతూ జరుపుకొనే ఈ పండుగనాడు , వ్యాపారస్తులు తమ కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తారు . కేదేరేశ్వర వ్రతాన్ని , లక్షిమ్మి పూజను కూడా జరుపుతారు . కొత్త అల్లుళ్ళను ఆహ్వనించి కొత్త బట్టలు , కుతుళ్ళకు బంగారం కానుకగా ఇస్తారు

శివరాత్రి
శివునికి ,పార్వతికి కళ్యాణం చేసే “శివరాత్రి” పండుగను పిబ్రవరి – మార్చి నెలల్లో జరుపుకుంటారు. స్నానాలు చేసి శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తారు పగలంతా ఉపవాసం ,రాత్రికి జాగారముండే ఈ పండుగనాడు , శివాలయాలను విద్యుద్దీపాలతో అలంకరిచడమే కాక , ఆలయాలచుట్టు ఎత్తెన ప్రభళ్ళు తిరుగాతుతాయి . చుట్టూ ప్రక్కల ఊళ్ళు ఒక్కదానితో ఒక్కటి పోటిపడి , ప్రభలను నిర్మించి అలంకరించి తమ గొప్పతనాన్ని చాటుకుంటాయి . రాష్టాములోని ప్రధాన శివాలయాలైన వేములావాడ , కీసరగుట్ట,ఏడుపాయలు దగ్గర శివరాత్రి ఉత్సవాలు ఘనముగా జరుగుతాయి .

రంజాన్

కఠిన నియమాలతో నెల రోజుల పాటు వుపవాసముండే ముస్లింలు రంజాన్ పండుగను గొప్పగా జరుపుకుంటారు . ఈ సందర్బంగా బిద వారికి బట్టలు ,డబ్బు దానము చేస్తారు . ఉపవాస దీక్ష ఒంటికి మంచి చేయటంతో పాటు , కుటుంబ సభ్యులు , ఇతర మానవులు సుఖసంతోషాలతో బతికెట్లు చేస్తున్న దేవునికి కృతజ్ఞతలు తెలిపే వ్రతంగా కుడా రంజాన్ ను పెర్కోటారు.

క్రిస్టమస్
జీసస్ క్రీస్తు జన్మదిన డిసెంబర్ 25వ తేదిన క్రిస్టమస్ ను రాష్టము లోని క్రైస్తవులందరు తమ ఇళ్ళపై నక్షత్రాలతో అలంకరించుకొంటారు . స్నేహితులు , ఇతర మతాల వారిని తమ ఇళ్ళకు ఆహ్వానించి , విన్డులనిచ్చి జరుపుకునే క్రిస్టమస్ క్రైస్తవుల ముఖ్యమైన పండుగ , ఆసియాలో రెండవ అతిపెద్ద చర్చి తెలంగాణ రాష్టము లోని మెదక్ లో ఉన్నది .

నాగుల చవితి

నాగుల చవితి పండుగను కొన్ని చోట్ల శ్రవణ మాసంలోను మరికొన్ని చోట్ల కార్తిక మాసంలోను చేస్తారు . శ్రావణ మాసమైతే పంచమి నాడు{నాగ పంచమి } కార్తిక మాసమైతే చవితినాడు{నాగుల చవితి } ఈ పండుగ జరుగుతుంది తెలంగాణా రాష్టమంతట నాగాపుజ జరుపుకోవడం ప్రాక్చారిత్రక కాలము నుంచి ఉన్నది ప్రతి గ్రామములో ను నాగ ప్రతిమలను ప్రతిష్టించి గ్రామస్తులు పూజ చేసుకుంటారు .
సాధారణముగా స్త్రీలు ఆ రోజు ఉపవాసముండి ఆవుపాలు పుట్టలో పోసి నాగాదేవతకు అర్పిస్తారు వెండితో చేసిన చిన్న చిన్న కళ్ళు పడుగలు ,పుట్ట కొనలతో జారవిడుస్తారు . కొందరి ఇళ్ళలో తమ పూజ గృహాలలోనే వెండి బంగారు నాగ ప్రతిమలు ప్రతిష్టించి పూజించుకునే ఆచారము వుంది చలిమిడి పానకం వాడపపు నైవేద్యం పెడుతారు సంతన వృద్ది కోసం సర్పభాద లేకుండా నివారిపబడడం కోసం పుట్ట మట్టిని జనులు తమ కళ్ళకు చెవులకు పూసుకుంటారు దీన్ని పుట్ట బంగారమని అంటారు .

వరలక్ష్మి వ్రతం
శ్రావణమాసంలో మంగళ శుక్రవారాలలో నిర్వహించే వ్రతం వరలక్ష్మి వ్రతం సంపద , సంతానం అభివృది చెందడానికి స్త్రీలు ఈ మాసంలో లక్స్మిదేవిని పుజిస్తారు . కన్యలు గౌరీదేవిని వివాహ ప్రాప్తి కై మంగళవారాలలో పూజ చేస్తారు . పువ్వులు , , కుంకుమ , పసుపు ,కాటుక కొబ్బరికాయలు మొదలైన అర్చన వస్తువులతో దేవిని పుజిస్తారు . ఆ రోజు తిమ్మిది రకాల పిండి వంటలు చేసి నైవేద్యమిచ్చి , తొమ్మిది పువ్వులతో తోరానాలల్లి తమ చేతికి కంకణంగా ధరిస్తారు. ముత్టేదువుల్ని పిలిచి వాయనాలిస్తారు . కొత్తగా పెళ్లి అయ్యిన వదువులు ఈ వ్రతం తప్పకుండా ఆచరిస్తారు . నవ వధువుల చేత ఈ వ్రతాన్ని వధువు తల్లి పుట్టి నింట ఆచరిప చేయుస్తుంది .

గురు పౌర్ణమి /వ్యాస పూర్ణిమ :
గురు పౌర్ణమి పండుగను ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు . వ్యాసుని పుట్టిన రోజుగా ఈ రోజున భావిస్తారు . ఈ పండుగ రోజు గురువును , ఉపాద్యాయులను , పెద్దలను పుజిస్తారు ముఖ్యంగా షిరిడి సాయిబాబా ఆలయాలో ప్రత్యేక పూజ జరుగుతుంది

బొడ్డెమ్మ పండుగ
బొడ్డెమ్మ పండుగ పిల్లల పండుగ , వినాయక చవితి నాడు లేదా భాద్రపద బహుళ పంచమి నాడు మెదలుపెట్టి మహాలయ అమావస్య తో బొడ్డెమ్మ పూజలు చేస్తారు పండుగ రోజున ఒక పిట మిద పుట్ట మన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోప్పురంగా నిర్మించి దాని చుట్టూ తంగేడు కట్ల మెదలగు పూలతో అలకంరిచి దాని తలమీద కలశాన్ని పెట్టి బియ్యం పోసి కొత్త రావికట్ట , పసుపుముద్దతో గౌరమ్మను చేసి విడివిడిగానైనా జరుపుకుంటారు . సాయంకాలము అరుభయట పుట్టమన్నుతో అలికిన స్థలములో ఈ బొద్దేమ్మను పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడి చివరకు పప్పుబెల్లాలు ప్రసాదంగా పంచుకుంట్టారు. బొడ్డెమ్మ పండుగను చివరి రోజున కలశములో తొమ్మిది రొజులూ పోసిన బియ్యంతో పాయసం చేసుకునటారు. ఈ పండుగను తిమ్మిది రోజులు జరుపుకుంటారు .

మొహర్రం (పీర్ల – పండుగ )
తెలంగాణలో మహమ్మదియుల మొహర్రం పండుగ జరుపుకుంటారు , దీనినే హిందువులు పీర్ల పండుగ అంటారు .ఈ పండుగ మహామ్మదియులైన తెలంగాణ హిందువులందరు కూడా దీనిలో పాల్గొంటారు . పిర్లను వారి ఇంటికి తీసుకొచ్చిన వారి కాళ్ళపై నీళ్ళు పోస్తారు . పిర్లకు ఎండుకొబ్బరి , పండ్లు మరియు చీరలు కుడా బహుకరిస్తారు . పిల్లలు లేనివారు పిల్లలు కావాలని వాటిని మొక్కుతారు పీర్ల పండుగ రోజుల్లో ప్రతి ఉరిలో పెద్ద జాతరలాంటిది జరుపుకుంటారు .
మొహర్రం అనేది అరబ్బీ క్యాలెండర్ యొక్క మెదటి నెల పేరు ఇస్తాం నూతన సంవత్సరం ఈ నేలతోనే మెదలవుతుంది . ఈ నెలలో చంద్రుడు కనిపిచింది ఐదవ రోజు నుంచి మొహర్రం పండుగ మొదలువుతుంది . దీనినే పిరిలా పండుగ అంటారు పీర్ అంటే మహాత్ములు ధర్మ నిర్దేశకులాని అర్ధం .
బక్రీద్ :మిలదన్ నబి పండుగలు
తెలంగాణలోని మహమ్మదియుల బక్రీద్ మిలదన్నబి పండుగలను కూడా తెలంగాణా హిందువులు వారి పండుగాల్లాగే వాటిలో పాల్గొని మహామదియులతో పాటు కలిసి భుజిస్తారు . పానీయాలు వగైరా సేవిస్తారు ఆలాయిబలయి చేసుకుంటారు కుతుబ్ షాహిల కాలములో నుండి నేటి వరకు వందలాది సంవత్సరాల నుండి హిందువులు మహమ్మదియుల తెలంగాణలో కలిసి మెలిసి వుండడం ఒక్కరి సంస్క్రతులను ఒక్కరు పండుగలను ఒక్కరు గుర్తించడం జరుగుతూ వస్తుంది