Palaeontology పురాజీవ శాస్త్రం

  భూమి ఏర్పడి సుమారు 4600 మిలియన్ సంవత్సరాలు అయినప్పటికి 1000 మిలియన్ సంవత్సరాల క్రిందట మాత్రమే భూ మండలం మీద జీవరాశులు ఆవిర్భవించి ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అభిప్రాయం ఈ మిలియన్ సంవత్సరాలలో అంటే ఆదిమ జీవుల ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కోట్లాది జంతువులు వృక్షాలు పుట్టి పెరిగి గిట్టినాయి ( చనిపోయినాయి ) ఈ భూత బౌమ కాలంలో వర్ధిల్లిన జీవరాశూలను శాస్త్రీయంగా చర్చించే విషమ భావాన్ని పురాజీవ శాస్త్రం అని అంటారు దీనిని ఆంగ్లంలో Paleontology అని అంటారు .
palaeo = పురాతన & ప్రాచీనం (ancint)
Onto = జీవి (life)
Logy = విజ్ణాన శాస్త్రము (SCINCE)
ఈ శాస్త్రము ప్రధానంగా శిలాస్తరములలో ( అవక్షేశీలలో ) ఉండే జీవ అవశేషాల పై ఆధారపడి ఉంటుంది . ఈ జీవ అవశేశాలే (శిలాజల ) ఈ శాస్త్ర ఆధ్యాయానికి ఆధారాలు .
పురాజీవ శాస్త్రాన్ని ప్రధానంగా పురా జంతు శాస్త్రము , పుర వృక్ష శాస్త్రముగా విభజించవచ్చు 

 జీవ అవశేషాల లేదా శిలాజాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి వాటిని సూక్ష్మ శిలాజాలు అంటారు .

ఇవి సాధారణముగా ఒక మీల్లీ మిటర్లు కంటే తక్కువగా ఉంటాయి వీటి పరిశీలనను సూక్ష్మ పురజీవ శాస్త్రము ( Micro palaeontology ) అంటారు 

పూర జీవ అవశేషాలు లేదా శిలాజాలు శిలాజాలు శిలాస్తరాలలో లభించడం వల్ల పురజీవ శాస్త్రాని భూ విజ్ణన శాస్త్ర శాఖలో ఒకటిగా పేర్కొంటారు .

శిలాజాలు

భూ పటలములో లభ్యమయ్యే అవక్షేప శిలలో అనుకూలమైన సహజ పరిస్థిలలో భద్రపరచబడిన పుర జంతు వృక్ష అవశేషాలను శిలాజాలు అని అంటారు .

శిలాజికరణకు అవసరమైన పరిస్తితులు

భూత భౌమ కాలంలో నివసించిన అన్నీ జీవులు శిలాజలుగా భద్రపడలేదు . ఒక జీవి శిలాజంగా భద్రపడాలంటే ఈ క్రింది రెండు పరిస్థితులు అవసరం .

మొదటిది జీవి శరీరంలో ఏదో ఒక కటినమైన భాగం వుండాలి . జీవి చనిపోయిన వెంటనే మృదు భాగాలు త్వరితముగా క్రుళ్లి పోతాయి కనుక జీవి అనేది శిలాజంగా మారాలంటే దాని శరీరంలో ఏదో ఒక కటిన భాగం ఉండి తీరాలి

ఇక రెండవ విషయానికి వస్తే జీవి మరణించిన వెంటనే ఏదో ఒక రకమైన పధార్థముతో కప్పబద్ఫి వుండాలి జలవరణంలో నిరంతర నిక్షేపణ జరుగుతుంది కనుక సముద్ర జీవులు చనిపోయిన వెంటనే అవక్షేపాలతో కప్పబడతాయి . కనుక ఇవి శిలాజంగా మారడానికి ఎక్కువ అవస్కారం వుంటుంది కానీ ఖండాంతర జీవులలో ఎక్కువ భాగం అవి చనిపోయిన వెంటనే అవక్షేపాల్తో కప్పబడవు కాబత్తో వాతావరణ ప్రభావాలకు గురై కుళ్ళి క్షితిళమై పోతాయి హిమముతో కప్పబడినప్పుడు ఖండాంతర జీవులు శిలాజాలుగా మారతాయి .

శిలాజాల భద్రత విధానాలు & లేదా శిలాజికరణ రీతులు

శిలాజాలు భద్రపడే విధానాలను బట్టి అనేల్క రకాలయిన శిలాజలను గుర్తించవచ్చు . కొన్ని శిలాజాలు మృదు భాగాలతో సహజీవి యధాత ధంగా భద్రమైతే కొన్ని శిలాజాలలో కేవలం జీవుల ఉనికిని సూచించే గుర్తులు మాత్రమే ఏర్పడతాయి .

సాద్గారణంగా జీవులు కటిన భాగాలే శిలాజాలుగా భద్రపడతాయి . శిలాజ భద్రత విధానాలు లేదా శిలాజికరణ పద్దతులు వుంటాయి .

1 . మార్పు చెందని అవశేషాలు

a జీవి యథాదంగా భద్రపడడం

b అస్థి పంజరము ఎటువంటి మార్పు చెందకుండా భద్రపడడం

2 మార్పు చెందిన అవశేషాలు

a పాషాణి భవనం

b కార్బనేటికరణం

1 . మార్పు చెందని అవశేషాలు

a . జీవి యధాతదంగా భద్రపడటం : – అతిశీతల ప్రాంతాలలో జీవ అవశేషాలు చాలా కాలం క్షితల కాకుండా ఉంటాయి .

జీవి మృధు భాగాలతో సహ భద్రపడడానికి వీలవుతుంది ఉధాహరణకి హిమ యుగం నాటి సైబెరియా మంచు భూములలో నివసించిన ఏనుగులు ఖడ్గ మృగాలు మేమేత్ లు హిమ సమాది వల్ల యధాతదంగా రక్త మాంసాలతో సహ భద్రపడ్డాయి .వాటి కళ్ళు చర్మము రక్తము చివరకు కడుపులోని పాక్షికంగా జీర్ణమైన శాత పదార్తాలు కూడా జంతువు చనిపోయిన ప్పుడు ఎలా ఉన్నాయో అదే స్తితిలో భద్రమై ఉన్నాయి .

కొన్ని వృక్షాల నుండి కారుతున్న జిగురులో కీటకాలు చిక్కుపడి సమాధి అయి శిలాజాలుగా భద్రపడ్డాయి .

అస్థి పంజరము ఎటువంటి మార్పు చెందకుండా భద్రపడడం

జీవి చ్నిపోయిన తరువాత మృదు భాగాలు క్షితలమై పోగా వాటి కావాచాలు కార్పరాలు అస్తిపంజరాలు వాటి నిర్మితిలోను సంఘటనలోను ఎటువంటి మార్పు లేకుండా శిలాజాలుగా భద్రపడుతాయి . ఇటువంటి శిలాజాలు ఆధునిక జియమ్ మహా యుగంలోపు శిల స్తారాలలో మాత్రమే ఎక్కువగా కన్పిస్తాయి .

2 మార్పు చెందిన అవశేశాలు

1 . పాషాణి భవనం

ఈ ప్రక్రియలో పురాతన జంతువుల లేదా వృక్షాల భాగాలలోని జీవ పదార్థము అణువు అణువుగా ద్రావణ రూపంలో తొలిగిపోయి దాని స్తానములో అదే పరిమాణంలో ఉన్న ఇన్ ఆర్గానిక్ పదార్థాలు అంటే సిలికా కాల్సియ కార్బొనేట్ ( caco3 ) వంటి ఖనిజాలు ప్రతిస్థాపన చెందుతాయి కానీ దాని బాహ్య రూపము యధాతధముగా భద్రపడి ఉంటుంది . ఈ ప్రక్రియ వల్ల మార్పు చెందిన శిలాజాలను పాషాణి భవనం అని అంటారు

2 . కార్బనేటికరణం

జంతువులు లేదా వృక్షాలు చనిపోయిన తర్వాత ఎక్కువ కాలము నీటిలో మునిగి అవక్షేపాలతో కప్పబడినప్పుడు అక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల ఆ జీవి నెమ్మదిగా శిథిలమై ఆక్సిజన్ హైడ్రోజన్ లను కొలిపోయి క్రమేణా కార్బన్ శాతం పెరుగుతుంది దీనినే కార్బనేటికరణం అని అంటారు ఉదా :- నీటిలో మునిగిన ఆకు మట్టి పొరచే కప్పబడినప్పుడు అది నల్లటి కార్బన్ పొరగా మారి ఆకు ఆకారాన్ని తెలియజేస్తుంది .

-గోండు వానా యుగంలో ని వృక్షా సంపద కార్బనేటికరణం చెంది నేల బొగ్గుగా మారింది .

3 జీవి ఇంతకు ముందు ఉన్నట్లు సూచించే వస్తువులు

జీవుల పరిణామ రీతులను తెలుసుకోవచ్చు

జంతువులలో క్రమబద్దమైన పరిణామం జరిగిందని శిలాజాల వల్ల తెలుస్తుంది ఇయోసిన్ కాలంలో పుట్టిన మొదటి గుర్రానికి ఒక్కొక్క కాళ్ళ కు 5 డెక్కలు ఉండేవి క్రమేపి ఈ డెక్కల సంఖ్య తగ్గుతూ నేడు ఒక్క డెక్క మాత్రమే మిగిలింది కనుక శిలాజాలు జీవులు పరిణామ రీతులను తెలుసుకోవడానికి ముఖ్య పాత్ర వహిస్తాయి .