తీన్మార్ మల్లన్న జీవిత విశేషాలు

teenmaar mallanna

సోషల్ మాధ్యమాల ద్వారా ఇంత పలుకుబడి అశేషమైనటువంటి అభిమానులను సంపాదించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి చింతపండు నవీన్ ఈయన అసలు పేరు కంటే ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ద్వారా ఆ పాత్రతోనే అభిమానుల అందరికి సుపరిచితము .

ఇతని అసలు పేరు చింత పండు నవీన్ ఈ పేరు చెపితే ఇతను ఎవరు మాకు తెల్వదు అంటారు జనాలు కానీ అదే వ్యక్తిని మరో పేరు తీన్మార్ మల్లన్న అంటే మాత్రం అందరికి తెలుసు సుమారు 9 లక్షలకు మంది సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజా ఆదరణ పొందాడు .

ఇతను నల్గొండ జిల్లాలోని మాదాపూర్ అనే గ్రామంలో 1982 జనవరి 17 వ తేదిన ఒక నిరుపేద కుటుంబం లో చింతపండు బాగయ్య మరియు జానమ్మ దంపతులకి జన్మించాడు .

మల్లన్న తండ్రి పాల వ్యాపారం చేసేవాడు అతను మాదాపూర్ లోని zphs కి వెళ్లి తను చదువుకునేటువంటి సమయంలో ఉదయం పుటా ఆ ఏరియాలో పేపర్లు వేస్తూ పేపర్ బాయ్ గా పని చేసాడు అప్పుడు తాను అలా చేయడానికి కారణం తన కుటుంబ ఆర్దిక పరిస్తితులే కారణంగా చదువు మధ్యలో. ఆపేసి కొంత కాలం చదువుకు విరామం తీసుకున్నాడు ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఎలాక్రిటిషన్ గా కూడా పని చేశాడు మల్లన్న .

తరువాత మల్లన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పొలిటికల్ సైన్స్ లో MA చేశాడు MBA కూడా పూర్తి చేశాడు .

మల్లన్న 2002 లో ఆంద్ర ప్రభతో తెలుగు భాషలో నడుస్తున్నఈ పేపర్ లో జర్నాలిస్తుగా పనిచేశాడు దాని తరువాత ఆంద్ర భూమి , మరియు ఐ న్యూస్ ఎన్టివి , జెమిని వంటి మొదలైన టివి చానళ్ళ లో పని చేశాడు దిని తరువాత ఇక పోతే తనకు ముద్ర పడ్డ టువంటి తీన్మార్ మల్లన్న పాత్రను 2012 సంవత్సరంలో ప్రజల యొక్క ఆదరణను పొందాడు దీనికి ప్రత్యకంగా ఆకట్టుకున్నటువంటి తను తెలంగాణా పల్లెటూరి యాసను మాట్లాడటం చేత ఒక్క పల్లెటూరి వాడిలాగా ఉండటం చేత మొదటగా పల్లె ప్రజలు అందరు ఆదరించటం మొదలు పెట్టారు ఇలా చాలా మంది అభిమానులను పెరగడం తో దిని కోసం ప్రత్యకమైన ప్రోగ్రాం ను ఏర్పాటు చేసారు అదే తీన్మార్ వార్తలు అని V6 లో తెలుగు న్యూస్ చానల్ లో ప్రారంభించారు .

ఆ తరువాత అతను వరంగల్ , ఖమ్మం , నల్గొండ పట్టభద్రుల ఎన్నికలలో పోటి చేయడం కోసం V6 న్యూస్ చానల్ నుండి విధుల నుండి తప్పుకున్నాడు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ , ఖమ్మం , నల్గొండ పట్టభద్రుల ఎన్నికలలో పోటి చేయటం కోసం మొదట గా స్వతంత్ర అభ్యర్థి గా పోటి చేయాలి అనుకున్న మళ్ళి కాంగ్రస్ పార్టి టిక్కెట్ ఇవ్వడంతో పార్టి తరుపున పోటి చేసి ఆ ఎన్నికలలో పరాజయం పాలయ్యాడు .

పాదయాత్ర

నవంబర్ 03 2020 న జనగామ లోని అంబేద్కర్ విగ్రహానికి పులా మాల వేసి పాదయాత్ర ను ప్రారంభించాడు

జయశంకర్ సార్ కాలోజి కళలు గన్న తెలంగాణా రాష్ట్ర నిర్మాణమే లక్ష్యం తో పాదయాత్ర కొనసాగుతుంది తెలిపారు

యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలన సిద్దం కమ్మన్నది మన తెలంగాణాలోన ” పాటతో తన ప్రచార హోరు సాగించారు

పాదయాత్రలో భాగంగా బచ్చన్న పేట ,రఘునాద్ పల్లి , మడికొండ ,కాజీపేట ,వరంగల్ ,చిలుకుర్ హుజూర్ నగర్ ,మిర్యాలగూడ ,, కోదాడ ,తుంగతుర్తి ,మోత్కూర్ , , చౌటుప్పల్ వంటి ప్రాంతాలలో తిరిగారు .

జనవరి 03న 2021 న భువనగిరిలో సావిత్రి భాయి పులే జయంతి రోజున పట్టభద్రుల గర్జన తో పాదయాత్ర కార్యక్రమానికి ముగింపు పలికారు .

ఈ పాదయాత్ర లో భాగంగా వివిధ మండల కేంద్రాలలో నిర్వహించిన ప్రచార సభలలో తన దైన తెలంగాణా యాసలో ఒటర్లను ఆకట్టుకున్నారు . తన పోరాటం రాష్ట్ర వ్యతిరేక విధానాల పైన మాత్రమేనని స్పష్టం చేశారు

తన సామజిక మాధ్యమం అయిన Q న్యూస్
యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రాసారాలను ప్రసారం చేసి ఎక్కువ మంది ఒటర్లను చేరువయ్యారు

ఫిబ్రవరి 22,2021 న నల్గొండ లో భారీ ర్యాలితో నల్గొండ – వరంగల్ -ఖమ్మం MLC అభ్యర్థిగా నామినేషన్ వేశారు .

గతం లో కంటే ఈ సారి ప్రజలు మల్లన్న ఎక్కువ ఆదరించారు అంతే కాక ప్రతి లెక్కింపులో ప్రభుత్వానికి గట్టి పోటి ని ఇచ్చారు అనే చెప్ప్పుకోవచ్చు . చివరికి ఈ ఓట్లలో కూడా పరాజయం పొందారు .