మహా శివరాత్రి వ్రతం కథ

ఒక రోజు కైలాస పర్వతము న శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతి దేవి శివుడితో ఇలా అడిగింది అన్ని వ్రతములలో కల ఉత్తము అయ్యిన వ్రతం ఏమిటి భక్తి ముక్తి అయ్యినటువంటి వ్రతం తెలియజేయండి అని కోరగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి యొక్క వ్రత విధానమును ఆ రోజు యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తాడు

దీనిని మాఘ బహుళ చతుర్దశి రోజున ఆచరించాలి అని తెలిసి కానీ తెలియక కానీ ఒక్క సారి చేసిన గాని యముని నుంచి తప్పించుకొని ముక్తి పొందుతారు అని తెలియ జెప్పి దానికి ఒక్క ఉదాహరణకు కథను వివరించాడు

ఒక పర్వత ప్రాంతమున హింసా వృత్తి గల వ్యాధుడు ఉండెను అతని పని ప్రతి రోజు తెల్లవారుజామున అడవికి వేటకు వెళ్లి సాయంకాలం కళ్ల ఏదేని ఒక మృగముని వేటాడి దానిని ఆహారంగా ఇంటికి తీసుకరావడం తన పని అలా తన కుటుంబం ను పోషిస్తూ కాలం వెలతీయసాగాడు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఒక రోజు అడవి అంత ఎంత తిరిగిన కూడా ఒక్క మృగం కూడా కనిపించలేదు అలా అని ఇంటికి ఉట్టి చేతులతో వేళ్ళ లేక మనసు ఒప్పలేక మళ్ళీ అడవి లొనే వేతక సాగాడు అంతలో ఓ నీరు ఉన్నటువంటి గుంట కంట పడింది ఇక్కడ నీరు ఉన్నాయి అంటే ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏవి అయ్యిన ఇక్కడికి నీరు త్రాగడం కోసం వస్తాయి కదా అప్పుడు నేను దానిని సంహరించి దానిని ఇంటికి తీసుకొని వెళ్లి నా కుటుంభం ఆకలి తీర్చవచ్చు అని అక్కడే వుంటువంటి ఒక్క చెట్టు ఎక్కి దాని పైనుండి ఏవి అయ్యిన జంతువులు ఇటు వైపుగా వస్తున్నాయా అని వీక్షిస్తున్నాడు ఆ క్రమంలో సరిగా కనిపించక పోవడం చేత అడ్డుగా ఉన్నటువంటి ఆకులను కొమ్మలను తుంచి వేయసాగాడు చలి విపరీతంగా ఉండడం చేత వణుకుతూ శివ శివ అంటూ బాణం ఎక్కు పెట్టి జంతువుల కోసం వీక్షిస్తున్నాడు

ఇంతలో ఒక లేడి నీరు త్రాగడానికి ఆ ప్రదేశానికి వచ్చింది అప్పుడు ఏ మాత్రము ఆలస్యం చేయక బాణం విడవబోగా ఆ లేడి ఒక్క సారిగా ఓ వ్యాధుడా నన్ను చంపకు అని మనిషి మాట్లాడిన తీరుగా మాట్లాడసాగను అంతలో అతడు ఉలిక్కిపడి చూడగా లేడి వేడుకుంటు న్నది నన్ను చంపకు అని సరే కానీ నీవు మనిషి వలె మాట్లాడుటకు ని సంగతి ఏంటి అని తెలుపము అని కోరగా అంధులకు లేడి నేను పూర్వజన్మలో రంభయను అప్సరస ను హిరణ్యక్షుడు అనేటువంటి రాక్షస రాజును ప్రేమించి ఆ క్రమంలో శివుడిని పూజించుట మర్చితిని అందువల్ల శివుడు కోపించి కామతు రయైన నీవు నీ ప్రియుడును జింకలుగా పన్నేడు సంవత్సరాల పాటు గడిపి ఒక వ్యాధుడు విల్లుతో చంపనుడగా శాప విమోచనము చెందును అని చెప్పను నేను ఇప్పుడు గర్భిణి ని అవ్యధను కనుక నన్ను వదిలి వేయుము మరొక జింక ఇక్కడికి వస్తుంది అది బాగా బలిసి ఉంటుంది దాని నువ్వు చంపుము లేదు అంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్లి ప్రసవించి మా కుటుంబ సభ్యులకు అప్ప జెప్పి వస్తాను అని తనని ఒప్పించి తిరిగి వెళ్లెను

రెండవ పూట గడిచింది మరొక లేడి అక్కడికి వచ్చింది వ్యాధుడు అది చూచి మిక్కిలి సంతోషంతో బాణం ఎక్కు పెట్టి విడవబోగ అది చూచిన లేడి భయంతో మానవుడు మాట్లాడిన మాదిరిగా మాట్లాడగా ఓ వ్యాధుడా నేను విరహం తో కృశించి వున్నాను

కావున నీవు నన్ను చంపిన అంత కాండ ఏమి లేదు కావున నన్ను చంపిన కూడా నేను నీ కుటుంబ నికి ఏ మాత్రం సరిపోను కావున ఎక్కడికి మరి కొంత సమయానికి మరొక బాగా బలిసిన మగ లేడి వస్తున్నది దాని సంహరించండి లేదా మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు నన్ను చంపండి అని తిరిగి వెళ్ళింది

ఈ రెండు జింకలు చెప్పిన తీరుగా మూడవ జింక కోసం వ్యాధుడు ఆకలితో వేచి చూస్తున్నాడు ఈ లోపు అక్కడికి ఒక మగ జింక వచ్చింది విల్లు ఎక్కు పెట్టి బాణమును సంధించబోగా ఇంతకు ముందు వచ్చిన ఆ జింక రెండు జింకలు తన ప్రియురాలు అని తానే చంపిన అని ప్రశ్నించెను అప్పుడు వ్యాధుడు ఆశ్చర్య పడి రెండు జింకలు మరలి వచ్చుటకు ప్రతిజ్ఞ చేశాయి అని నిన్ను నాకు ఆహారంగా పంపుతాయి అని చెప్పి వెళ్లాయి అని అన్నాడు ఆ మాట విని నేను తెల్లవారు జామున మీ గృహమునకు వస్తానని నా సతీమణి రువుతుమని ఆమెతో గడిపి బంధు మిత్రులతో అనుజ్ఞ పొంది మరలి వస్తానని ప్రమాణము చేసి వెళ్ళింది

ఈట్లు నాలుగు జాములు గడిచిపోయాయి సూర్యోదయం సమయంలో వ్యాధుడు లేడీల కొరకు ఎదురు చూపులు చూస్తున్నాడు ఇలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ నాలుగు జింకలు వచ్చి నన్ను చంపు అంటే నన్ను చంపు అనుచు న్నాయి

అతడు ఆ జంతువుల సత్య నిష్ఠకు ఆచర్య చికితుడు అయ్యి వాటిని చంపుటకు అతని మనసు ఒప్పక తన హింసా వృత్తి పై ఈర్ష్య కలిగెను ఓ మృగములారా మీ నివాసములకు వెళ్లుము నాకు మాంసం అక్కర్లేదు మృగముల బెదిరించుట బంధించుట చంపుట పాపం కుటుంభం కొరకు ఇక నేను ఈ పాపం చేయను ధర్మములను దయ మూలము సత్యఫలము నీవు నాకు గురువు ఉపదేశం కుటుంభం సమేతంగా నీవు వెళ్లుము నేనింకా సత్య ధర్మమును నాశ్రసించి అస్త్రములను వదిలి వేస్తాను అని చెప్పి ధనుర్బానములు వదిలి వేసి మృగములకి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసెను ఆ లోగా ఆకాశంలో దేవా దుందువలు మోగాయి పుష్ప వృష్టి కురిసింది దేవా దూతలు మనోహరంగా విమనంను తెచ్చి ఇట్లా అనిరి ఓ మహానుభావా నీవు శివరాత్రి ప్రభావమున నీ పాతకం క్షినిచ్చింది ఉపావసం మరియు జాగహరంను నీకు తెలియకుండానే జరిపితివి యమ యామమునకు పూజింతివి నీవు ఎక్కినది బిల్వ వృక్షం దాని క్రింద సవ్యంబు లింగం ఒకటి గుబురులో ఉంది నీవు తెలియగానే బిల్వ పత్రములు త్రుంచి వేసినప్పుడు ఆ పత్రములు శివ లింగము పై పడినవి అలా శివుడిని పూజింతివి సశరీరముగా స్వర్గానికి వెళ్లుము మృగ రాజా నీవు సకుటుంభముగా నక్షత్రపధం పొందుము

ఈ కధ చెప్పిన తర్వాత పరమేశ్వరుడు పార్వతి తో నిట్లనెను దేవి ఆ మృగ కుటుంబమే ఆకాశము న కనిపించే మృగ శిర నక్షత్రం మూడు నక్షత్రాలు ముందున్న రెండు జింక పిల్లలు వెనుకనున్న మూడవది మృగ ఈ మూడింటిని మృగ శిర మందురు వాని వెనుక నుండు నక్షత్రాములలో ఉజ్వలమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *