బతుకమ్మ విశేషాలు

బతుకమ్మ విశేషాలు post thumbnail image

ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా మనం పూలని దేవుడికి పెట్టి పుజిస్తారు కానీ అదే పూలను ఒక్క దగ్గరపెట్టి పూజించేది మన వద్ద మాత్రమే ఆ అరుదైన గౌరవం మన తెలంగాణా సంప్రాదాయాలలో ఒకటిగా చేర్చబడింది . మన తెలుగు ప్రజలు సంప్రదాయాలకి పద్ధతులకి ఎంతో విలువని ఇస్తారు మన తెలుగు ప్రజలు ఒక్కపుడు మన తెలంగాణలో మాత్రమే ఉండేది . కానీ ఇప్పుడు ఖండాంతరాలు సప్త సముద్రాల అవతల కుడా బతుకమ్మ అడుతున్నారు .
అనగా మన తెలుగు ఖ్యాతి ఎంత వరకు చేరిందో మనం ఆలోచించాలి మన ప్రజలు ఎంతగానో ఎందుకు ఆచరిస్తున్నారు అని అందరికి సందేహాలు వస్తుంటాయి కాని వారు ఒక్క సారి మన సంప్రదాయాలు మన పద్దతులు చూస్తే జీవితంలో మరువరు .
ఇక మన బతుకమ్మ విషయానికి వస్తే తొమ్మిది రోజులు ఈ పండుగా జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు కుడా ఒక్కొక ప్రత్యేకత వుంటుంది .
రోజు రోజు పువ్వులను ఒక్క క్రమమైన పద్దతిలో పేర్చి ప్రతి ఒక్క రోజు ఒక రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు .
మొదటగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు బతుకమ్మ ఫలహారం గా పెసరపప్పు చక్కర ను ప్రసాదంగా పెడుతారు .
రెండవ రోజు పప్పు బియ్యం
మూడవ రోజు పల్లిల తో చేసిన ముద్దలు
నాల్గవ రోజు నాన బెట్ట్టిన బియ్యం
ఐదవ రోజు అట్లను
అరవ రోజు బతుకమ్మ ను అర్రెం అంటారు ఈ రోజు బతుకమ్మ ను అంటారు .
ఏడవ రోజు ఎలుక పండు
ఎనమిదో రోజు నువ్వులు బెల్లం
తొమ్మిది రోజున చివరి రోజున
పండుగ వస్తుంది అంటే తెలంగాణ ఆడబిడ్డలు వెయ్యి కళ్ళతో ఎదురు చూసే పండుగ ఇది ఎప్పుడు ఎప్పుడు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు ఆడవాళ్ళ కి అతి పెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగా పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిన ఎంతో మంది ఈ బతుకమ్మ రోజు కలుసుకొంటారు అని వారి సంతోషాలకి అవధులు వుండవుపొద్దు పొద్దునే లేచి చెరువు గట్టుకి , చేను చేలకలోకి వెళ్లి తంగేడు పువ్గువు ,గునుగు పువ్వు , ముత్యాల పువ్వు ,చిట్టి చేమంతులు మొదలైన పువ్వులు తిసుకవచ్చ్చి గునుగు పువ్వుకి రంగులు అద్ది ఇంద బెట్టె వారు ముందుగా గుమ్మడి ఆకుని తిసుకవచ్చి తామ్బాలం లో పరిచి దాని పై ఒక్కొక వరుసగా తంగేడు పూలను పేరుస్తూ దాని పై గునుగు పువ్వు రంగు రంగు రంగులతో అద్దిన పువ్వులు చిట్టి చామంతులు , ఇంటి వద్ద దొరికే బంతి పువ్వులు , కట్లషా పువ్వు లు వివిధ రకాలైన పువ్వులను తో అందమైన బతుకమ్మ ను తయారు చేస్తారు ఆ బతుకమ్మ లో పసుపు తో తయారుచేసిన గౌరమ్మ ను మధ్యలో పెట్టి ఉడుబస్తిలని ముట్టించి కొబ్బరి కాయ కొట్టి పూజ చేసిన తరువాత ఇంట్లో నుండి బయటికి తిసుకవస్తూ ఊరు ఊరంతా ఒక్క సారిగా డప్పు చప్పుళ్ళు తో చెరువు గట్ట్టు వద్దకి బయలు దేరుతారు ఒక్క సారిగా అడబిద్దలంతా కదిలి వస్తుంటే చూడాడానికి చూడముచ్చటగా వుంటుంది అందరు ఒక్క దగ్గరగా వచ్చి కొంత మంది ఒక్క క్క గుంపుగా సమూహంగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతారు అనతరం బతుకమ్మ లో గౌరమ్మ గా చేసినటువంటి పసుపును తీసుకొని ముతయుదువులు పుస్తెలు (మంగాల్యానికి ) కి రాసుకుంటారు తరువాత నైవేద్యంగా తిసుకవచ్చిన బియ్యపు పిండితో చేసిన ముద్దలను ప్రసాదంగా పంచుతారు బతుకమ్మ ను తీసుకెళ్ళి నీటిలో చెరువులో వదిలి వేస్తారు మల్లి ఇంటికి వచ్చేటప్పుడు పాటలు పాడుతూ వస్తారు
ఇక్కడి తో బతుకమ్మ పండుగా ముగుస్తుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

తెలంగాణ ప్రత్యేకతలు Telangana festivalsతెలంగాణ ప్రత్యేకతలు Telangana festivals

తెలంగాణ రాష్టము దక్షిణ భారతదేశంలో గోండ్వానా శిలలపై దక్కన్ పిటభూమిలో ఉంది .  అనాదిగా ఇది  వైవిద్యం  సంస్కృతి, కళలకు ప్రసద్ది చెందింది కళలు : హస్తకళలు :  భారతీయ హస్తకళల్లో తెలంగాణ చేతి వృత్తులకు విశిష్ట స్థానం ఉంది వస్త్ర

పవర్‌గ్రిడ్‌లో 114 ఖాళీలుపవర్‌గ్రిడ్‌లో 114 ఖాళీలు

నాగ్‌పుర్‌లోని పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన వెస్ట్రన్‌ రీజియన్‌ కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 114 విభాగాలు: అసిస్టెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ (హ్యూమన్‌ రిసోర్స్‌), డిప్లొమా(ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌),డిప్లొమా(ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేట్‌(సివిల్‌, ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌).