హిందు సాంప్రదాయ వివాహం (పెళ్లి ) Hindu Traditional Marriage

హిందు సాంప్రదాయ వివాహ విధానం

ముందుగా మనం  పెళ్లి  గురించి ఆలోచన  వచిన్నప్పుడు అన్ని దేశాలు  ముందుగా  మన భారత దేశం గురించి మాట్లాడుకుంటారు ఎందుకు అంటే మన దేశంలో జరిగే పెళ్లి విధానం కాని మనం పెళ్లి తర్వాత వుండే విధానం కాని మన సాంప్రదాయం కాని అన్ని కూడా మరెక్కడా  పాటించారు .

ముందుగా పెళ్లి అనే ముచ్చట వచ్చినప్పుడు అటు ఏడూ తరాలు ఎటు ఏడూ తరాలు చూడాలి అని అంటారు అసలు  దాని కథ ఏంటో తెలుసుకుందాం.

ఇంట్లో  ఎదిగిన ఆడపిల్ల వుంటే ఆ  కన్నా తండ్రి ఆలోచన నా బిడ్డ  మంచి సంపన్నమైన , మర్యాద గల కుటుంభం లోకి  పంపించాలి నా కూతురుకి ఎటువంటి కష్టం రాకూడదు అని ఆలోచిస్తాడు అందుకు అని ఆ కుటుంభం ఎలాంటి వారు నా కూతురు ని పంపిస్తే  నా కూతురు ఆ కుటుంభం  లో కలిసి పోగలదా లేదా అని విచారణ చేసి అన్ని తెలుసుకొని ఆ కుటుంభం గురంచి పూర్తిగా తెలుసుకొని అన్ని సవ్యంగా వున్నాయి అనుకుంటే అప్పుడు  అంగీకారం చేసుకొని ఆ తండ్రికి అన్ని కుదురుగా ఉన్నాయి అనిపిస్తే తన కూతురు ని  వారి ఇంటికి పంపిస్తాడు ఇవి అన్ని జరగడానికి  చాలా పెద్ద తతంగం వుంటుంది .

లేని యడల సంభాదాలు చూడడం మొదలు పెడతారు  గతంలో రాజుల కాలంలో స్వయంవరాలు పెట్టె వారు ఆ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులు అయితే వారికి ఇచ్చి వివాహం చేసే వారు .

పెండ్లి చూపులు 

మొదటగా పెళ్లి అని ఆలోచన  వచ్చినపుడు మా అబ్బాయి లేదా మా అమ్మాయి కి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం అని తెలిసిన వాళ్లకి చెపుతారు మా అబ్బాయి లేదా  అమ్మాయి కి మంచి సంబంధం చూడండి  అని  చెప్తారు . ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే వరుస అయ్యిన అంటే బావ మరుదలు అయ్యి వుంటే వారు ఇరువురు కి సమతమే అయితే వారిద్దరికీ వివాహం చేస్తారు .

మొదటగా వివహం చేయదలచి పెద్దలకు చెప్పిన తరువాత వారు పాలనా చోట మంచి సంభంధం వుంది మీకు అన్ని విధాల మీకు సరి తుగుతారు మీరు ఒక్కసారి వెళ్లి వస్తే మంచిది అని చెప్పిన పిదప వారు ఆ కుటుంభం  గురంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పూర్తి వివరాలు సేకరించిన తరువాత వారికి అన్ని విధాలుగా తగిన వారు అనిపించినా తరువాత వారు ఒక్క సారి వారి ఇంటికి వెళ్లి అన్ని చూసుకుని మాట్లాడుకుంటారు అన్ని సవ్యంగా జరిగిన తర్వాత ఇద్దరికి సమతమే అని అనుకున్నాక  రెండు కుటుంభాలు  ఒప్పుకున్నాక కట్న కానుకలు మాట్లాడుకోవడం చేస్తారు . ఇవి అన్ని సరే అన్నాక మొదటి ఘట్టం మొదలు అవుతుంది .

నిశ్చితార్థం

పూలు పండ్లు – నిశ్చితార్ధం Engagement

పెండ్లి గురంచి పూర్తి వివరములు పూర్తిగా మాట్లాడుకున్న తర్వాత అన్ని సరే అనుకున్న కా జరిగేటువంటి కార్యక్రమమే ఈ పూలు పండ్లు అంటారు

ఒక మంచి రోజు చూసి పెళ్లి చేయుటకు తిధులు అన్ని చూసి ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెడతారు దీనిని నిర్ణయం చేసిది పురోహితుడు ఇంత తతంగము మొత్తం కుడా ఇరువురి భంధువులు సమక్షంలో పెళ్లి యొక్క ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించి అమ్మాయి తరుపు వారిది అబ్బాయి తరుపుది అమ్మాయి వారు లగ్న పత్రికలు తాంబూలాలు మార్చుకుంటారు ఇలా జరిగేటువంటి వేడుకని ఒక పెళ్లి కొరకు ఒప్పదం అని అంటారు ఈ సమయములో నిశ్చి తార్ధం రోజున అమ్మాయి అబ్బాయి ఉంగారాలు మార్చుకుంటారు ఇలా మార్చుకోవడంతో సగం పెళ్లి అయ్యి పోయినట్టే నిశ్చి తార్ధం అంటే పెళ్లి నిశ్చయం అని అర్ధం ఇలా జరిగిన పిదప తక్కువ కాలంలో వివాహం ద్వారా సంబందాన్ని ఏర్పరచుకుని ఒకటి అవడం కోసం ప్రతి పాదనను వాగ్దానం ద్వారా నిశ్చయించుకుంటారు దీనిని ఆంగ్లం లో Engagement అంటారు .

పెళ్లి పనులు

నిశ్చితార్థం ఎప్పుడు అయితే ముగిసిందో అప్పటి నుండి పెట్టుకున్నటువంటి ముహూర్త సమాయాని కల్ల వివాహం జరగడం కోసం శత ప్రయత్నాలు చేస్తారు .

మొదటగా ఆడపెళ్ళి వారు అబ్బాయి తరుపున వారికి ఒప్పుకున్న కట్న కానుకలను ఎ మాత్రం తగ్గకూడదు అని ఎలాంటి తలంపు రాకూడదు అని శత ప్రయత్నాలు చేసి అందుకు సరిపడేటువంటి డబ్బును ముందుగానే సమకుర్చుకుంటాడు .

తధనతరం పెళ్లి పత్రికలు అచ్చువేయించి ఎవరి ఎవరిని ఆహ్వానిచాలి బంధువులలో మాట రాకూడదు అని ఎవ్వరిని మర్చిపోకూడదు పిలవాలి అని నిశ్చే ఎంచుకొని బంధువుల అందరిని గుర్తు చేసుకొని మరి ఆహ్వానిస్తారు

ఇంతకు ముందు రోజులలో ఇంటి ముందే పెళ్లి చెయ్యాలి అనేవారు కాని ఇప్పుడు పంక్షన్ హాల్ లో ఎక్కువగా చేస్తున్నారు ఇంటి ముందు మామిడి తోరాణాలు పచ్చని పందిర్లు వేసి వారం ముందే బంధువులు వచ్చి చేరె వారు పెండ్లి పనులలోనిమగ్నమై వారు అందరు పనులలో సాయం అయ్యేవారు కాని నేడు ఎ రోజు పెళ్లి అయితే ఆ రోజే వచ్చి వధువరులను ఆశీర్వదించి వెళ్ళుతున్నారు పెళ్లి అనగా ఆడపిల్ల తరుపున వారు పెద్దలు పిల్లగాడిని తిసుక రావడానికి ఐదుగురు లేదా ముగ్గురు బావమరిది వరుస అయ్యిన వారిని తోడుకొని పిల్లగాని ఇంటికి వెళ్తారు అక్కడ విరు వెళ్ళిన తర్వాత వారి కార్యక్రమాలు మొదలు పెడతారు వీరు భోజనం చేసిన తర్వాత వారు ఐరొండ్ల పట్టుక వచ్చి ఐరొండ్ల పూజా చేస్తారు ఎవరు అయ్యిన పెండ్లి పిలగాని చెయ్యదలచిన వారు వుంటే నూతన వస్త్రములు సమర్పించి పెళ్లి పిలగాడిని చేస్తారు అనతరం పిలగాని తోలుక పోవచ్చిన వారు బాజ భజంత్రిలతో పిల్ల గాని తీసుకొని పిల్ల వారి ఇంటికి చేరుతాడు పెళ్లి పందిరి వద్దకి కాక వేరొక చొటన ఉంచుతారు ఆ తర్వాత పిల్ల వారి ఇంటి వద్ద కార్యక్రమాలు చేసే వారు చేస్తూ వుంటారు పెండ్లి పిల్లను తయరు చేస్తారు తదనంతరం అమ్మాయి మంగళి వారి చేత గోర్లు తీయించి మంగళ స్నానం చేయిస్తారు తదనంతరం పోలు పోస్తారు వరుస అయినటువంటి వారిని పక్కన కూర్చోబెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తారు తర్వాత ఈ కార్యక్రం అయిపోయిన తర్వాత అందరు ఎద్ర్కోలు కార్యక్రమం మొదలు పెడతారు పెళ్లి కొడుకు ఉన్నటువంటి ప్రదేశానికి కుడుకలు చెక్కర తువ్వాలలు కుంకుమ తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళాక పెళ్లి పిల్ల గాడిని కుర్చీలో కూర్చో బెట్టి బొట్టు పెట్టి తువ్వాల కప్ప్పుతారు తదుపరి వరుస అయ్యిన వారు ఒక్కరికి ఒక్కరు నోరు తిపి చేసుకుంటారు తిసుక వచ్చినటువంటి కుడుకలలో చెక్కెర పోసి ఒక్కరి నోట్లో మరోక్కరు చెక్కర తో నోరు తీపి చేసుకుంటారు కొంత మంది కుంకుమ చల్లుకొని వరుస అయ్యిన వారు ఒకరి పై మరోక్కరు చల్లుకుంటారు తదుపరి పిల్లగాడిని భాజా బజంత్రిలతో తోడుకొని వెళ్తారు పెళ్లి ఇంటికి వెళ్ళగానే బావ మరిది ఎదురుగా వచ్చి బావను ఎత్తుకొని మండపం వద్దక్కి తోడుకొని వెళ్తాడు అక్కడ దించి కాళ్ళు కడిగిన తర్వాత బావమరిది కట్నం అడుగుతారు బావ మరిది కట్నం ఇచ్చిన తరువాత అక్కడ నుంచి కదులుతారు

ఇలా ఈ వివాహంలో కూడా  చాల రకాలు వున్నాయి

ఇంకా  వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *