జనవరి 26 కి ఆగస్ట్ 15 కి తేడా ?

జనవరి 26 కి ఆగస్ట్ 15 కి తేడా ?

ఈ రెండు కూడా జాతీయ పండుగలు రెండు సందర్భాలలో కూడా జాతీయ జెండాని ఎగురవేస్తాము దేశం మొత్తం లో జరుపుకునేటువంటి పండుగ ఈ రెండు సందర్భాలలో నాయకులను స్మరించుకుంటాం గణతంత్ర దినోత్సవం స్వాతంత్య్ర దినోత్సవం ,మధ్య తేడా తెలియని పరిస్థితి వుంది 15 ఆగస్టు అనేది 1947 ఆగస్టు 15 వ తారీఖున బ్రిటిష్ సామ్రాజ్య వాదులు మన దేశాన్ని వదిలి పెట్టి మనల్ని మనం పరిపాలించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ మన దేశాన్ని వదిలి వెళ్ళి పోయినటువంటి రోజు అంటే మనకు స్వాతంత్య్రము బ్రిటిష్ సామ్రాజ్యం వాదం నుండి వచ్చినటువంటి రోజు 15 ఆగస్టు(జెండా వందనం ) అని పేర్కొంటారు దీన్ని స్వాతంత్య్ర దినోత్సవము గా జరుపుకుంటాం కానీ 26 జనవరి అనేది 15 ఆగస్టు లాంటింది కాదు ఇది మన యొక్క రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు మనకు స్వాతంత్య్రం వచ్చింది హ వచ్చినటువంటి స్వాతంత్య్రన్నీ స్వేచ్ఛగా అందరూ అనుభవించాలి అని అంటే ఏ రకమైన పద్దతుల ద్వారా పాలన సాగాలి ప్రజలకు ఏ రకమైన హక్కులు ఉంటాయి ఏ రకమైన విధులు ఉంటాయి అలాగే పార్లమెంట్ ఏంటి అసంబ్లీ ఏంటి అలాగే ప్రజల యొక్క పాలన కొనసాగించే విధానం ఎలా ఉండాలి ఎంపీలను ఎలా ఎన్నుకోవాలి ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకోవాలి ప్రభుత్వం యొక్క భాద్యత ఏంటి సుప్రీం కోర్ట్ ఎలా వ్యవహరించాలి కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా వ్యవహరించాలి న్యాయ వ్యవస్థ ఏ రకముగా ఉండాలి ఇలాంటి అనేకమైన విశాల పైన చర్చ జరిపి హక్కులు విధులు పరిపాలన సంభందించిన అంశాలు అన్ని కూడా ఒక్కే దగ్గర క్రోడీకరించి ఒక రాజ్యాంగం అనేటువంటి దాని రూపొందించుకొని దాన్ని మనం రూపకల్పన చేసుకోవాలి అని భావించి 1946లో రాజ్యంగా పరిషత్ ఎన్నిక చేసుకోవడం జరిగింది దీనిలో మొత్తం 284 మంది సభ్యలుగా వాళ్ళు మన దేశం భవిష్యత్ లో ఏ రకమైన ఏ దేశంగా ఉండాలి ఏ రకమైన పాలన కొనసాగాలి అని ఆలోచించడం కోసం వీళ్ళను ఎన్నుకోవడం జరిగింది 284 మంది లో వీళ్ళలో ఒక ఏడుగురిని రచన కమిటీ అంటే constustion drafting commiti డా ” బి ఆర్ అంబెడ్కర్ అధ్యక్షతన ఈ రచన కమిటీ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రచన కమిటీ ప్రపంచం లో ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగాలని ప్రపంచంలో జరుగుతున్న అనేక విధానాలను అలాగే పౌరులకు మానవ హక్కులు విధానాలని ఇలాంటివి అనేకం అధ్యయనం చేసి దాదాపు ప్రపంచంలోనే ఒక్క ఉత్తమ మైనటువంటి రాజ్యంగా రూపొందించుకోవాలి అనేటువంటి ఉదేశ్యం తో ఈ ప్రయత్నం చేసి మనము రాజ్యంగా రూపొందించుకోవాలి అని దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు డా బి ఆర్ అంబెడ్కర్ అధ్యక్షతన ఈ రాజ్యంగా న్నీ రచించడం జరిగింది ఈ రచించిన రాజ్యంగాము 1949 నవంబర్ 26నాటికి పూర్తి అయ్యింది కావున దీని అమలులోకి తీసుకొచ్చుకోవాలి అంటే ఈ పాత సంవత్సరం కంటే ఈ కొత్త సంవత్సరం తో ప్రారంభిస్తే బాగుంటుంది అని నవంబర్ 26 తారీకు పూర్తి అయ్యింది కాబట్టి 1950 జనవరి 26 తారీకు గా పెట్టుకొని ఆ రోజు మన దేశాన్ని ఈ రాజ్యాంగంప్రకారం మన పాలన కోన సాగించుకుంటే బాగుంటుంది అని ఆ రోజు వున్నటువంటి రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించింది జనవరి 26వ తారీకు నుండి అమలులోకి వచ్చింది మనల్ని మనము ఎలా పరిపాలించుకోవాలి అని నాటి నుండి వస్తున్నది రాజ్యాంగాము అనేటువంటి ఏర్పాటులో అంబెడ్కర్ ప్రాధానమైన భూమిక పోషించారు దేశంలో అప్పటికి ఉన్నటువంటి పరిస్థి ఏంటి అందరూ సమానమే అనేటువంటి ప్రాతిపదిక తీసుక వచ్చారు అప్పుడు ఏంటి అంటే డబ్బు ఉన్నటువంటి వారికీ మాత్రమే ఓటు ఉండేది ఇప్పుడు ఏంటి అందరూ సమానమే డబ్బు వున్నా లేకున్నా రోజు కూలి అయ్యిన ఒక్కటే అనేటువంటి ప్రాతిపదికన తీసుక వచ్చాడు ఓటు విషయం లో అందరూ సమానేమీ విద్య వున్నా లేకున్నా కులం మతం భాష ప్రాంతం అన్ని కూడా రాజ్యాంగం ముందు సమానమే ఇది మనుషులు అందరూ సమానమే అని రాజ్యాంగం పేర్కొన్నది గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నది గతం లో గణతంత్ర రాజ్యం అంటే గతం లో గాణాలూ రాజ్యాంగ చట్టాలు చేసేప్పుడు గతంలో పరిపాలన సాగే క్రమములో గాని ప్రజల యొక్క బాగా స్వామ్యము కింది స్థాయి నుండి ఉండడమే గణతంత్రం అనేది మనం కింది స్థాయి నుండి ఉండాలి అనుకున్నాం కాబట్టే ఈ రోజు కింది స్థాయి నుండి గ్రామాల నుండి గ్రామ పంచాయితీలు ఏర్పాటు చేసుకోవడము జరిగింది ఇది ప్రజా స్వామ్య దేశంగా ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ మత అల్లాగే పీడనం ను నిరోధించే స్వేచ్ఛ అంటే ప్రతి మనిషి తన యొక్క అభిప్రాయాన్ని తెలియపర్చవచ్చు ఈ హక్కు మన రాజ్యాంగము మనకి కల్పించింది భిన్న అభిప్రాయాలూ ప్రభుత్వం లేదా వ్యక్తులు తమ అభిప్రాయాలూ తెలియపర్చినప్పుడు వారి అభిప్రాయాలూ తెలియపర్చే స్వేచ్ఛ మనకి రాజ్యాంగం మనకి కల్పించింది అలాగే గణతంత్రం ఆర్థికంగా సోషలిస్టు తరహా విధానం ఉండాలి అని ప్రతిపాదన చేసారు అందరికి చదువు వైద్యం గృహ కల్పన వ్యవసాయ రంగం అన్నింటి లోముందు ఉండాలి అది ప్రభుత్వం చూసుకునే విధంగా ఉండాలి అని పేర్కొనడం జరిగింది విభిన్న సంస్కృతి ల నిలయం విభిన్న మైన మతాల నిలయం విభిన్న భాషలు మన దేశం సర్వసత్తాక గణతంత్ర దేశం ఆదేశ సూత్రాలు భాష అధికరణ ప్రపంచ మొత్తం లో అతి పెద్ద లిఖిత పూరితమైన రాజ్యాంగం

29 thoughts on “జనవరి 26 కి ఆగస్ట్ 15 కి తేడా ?”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *