ఆశాడం అంటే అనార్దలా ?

ఆషాడమాసం

ఆషాడ మాసం ఆరంభం అవుతుందంటేనే.. ఆషాడమాసం శుభకార్యాలకు మంచిది కాదని, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను ఉందని పండితులు చెబుతారు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిళ్లు చేయరు హిందువులు. అవసరమైతే.. పెళ్లిని.. మూడు నెలలు, నాలుగు నెలలు వాయిదా వేస్తారు కానీ.. ఆషాడ మాసంలో మాత్రం పెళ్లి భజంత్రీలు మోగించరు. అలాగే ఆషాడ మాసంలో కొత్తగా పెళ్లైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకం కూడా ఉంది.
ఈ సంప్రదాయాల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదా ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు ఎందుకు చేయరు ? ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది ? ఆషాడ మాసంలో అనేక పూజలు, వ్రతాలు నిర్వహించడానికి మంచిదైనప్పుడు, పెళ్లిళ్లు చేయడానికి ఎందుకు మంచిది కాదు ? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి ?
* ఆషాడ మాసంలో పెళ్లిళ్లు చేస్తే ఏమవుతుంది ?
ఆషాడ మాసం
ఆషాడ మాసంను ఆషాడ మంత్, ఆది మాసం అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు.
* దేవతారాధన
ఆషాడ అనేది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది.
* ఎప్పుడు ?
ఆషాడ మాసం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జూన్, జూలై మధ్యలో వస్తుంది.
* శుభకార్యాలు
ఆషాడ మాసంలో పెళ్లిళ్లే కాదు.. గృహప్రవేశం, శంకు స్థాపన వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదు. కనీసం శుభకార్యాలను, మంచి పనులు ప్రారంభించరు.
* పూజలకు
మరో విచిత్రమేమిటంటే.. ఆషాడ మాసం శుభకార్యాలకు మంచిది కాదు. కానీ పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్ద పెద్ద శుభకార్యాలకు శుభప్రదమైనది. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి.
* పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం
అసలు ఆషాడంలో పెళ్లిళ్లు చేయకపోవడానికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో ఆలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటారు. దీనివల్ల వాళ్లకు పెళ్లి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే.. ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు
* మరో కారణం
ఉత్తరాయణ, దక్షిణాయణ కథల ప్రకారం ఆషాడ మాసం సమయంలో.. దేవుడు నిద్రలోకి వెళ్తాడట. దీనివల్ల.. పెళ్లి చేసుకున్న వాళ్లకు దేవుడి ఆశీస్సులు అందవనే నమ్మకంతో.. ఇలా ఆషాడంలో పెళ్లిళ్లకు బ్రేక్ వేసినట్లు చెబుతారు.
* డబ్బు
అలాగే సౌత్ ఇండియాలో ఆషాడ మాసం అంటే.. ఎలాంటి పంట చేతిలో ఉండదు. పెళ్లి చేయడానికి అవసరమయ్యే డబ్బులు ఉండక ఇలా సంప్రదాయం పేరుతో ఆషాడంలో పెళ్లి చేయకూడదు అనే నిబంధన తీసుకువచ్చారని పండితులు చెబుతున్నారు.
* వాతావరణం
పూర్వకాలంలో పెళ్లి అంటే.. ఎక్కువ ఖాళీ ప్రదేశంలో పెద్ద పెద్ద పరదాలు కట్టి నిర్వహించేవాళ్లు. ఆషాడ మాసంలో గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. గాలి తీవ్రతకు పెళ్లికి ఆటంకం ఏర్పడవచ్చు. అలాగే పెళ్లి వంటకాలపై దుమ్ము, ధూళి పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. విద్యుత్ వైర్లు కట్ అవడం, హోమాల వల్ల ప్రమాదాలకు అవకాశాలు ఉంటాయి. ఈ కారణాల వల్ల.. ఆషాడంలో పెళ్లి కార్యక్రమాలు నిర్వహించకపోవడం మంచిదని పెద్దవాళ్లు ఈ నిర్ణయానికొచ్చారు.
* అత్తా, కోడళ్లు
ఆంధ్రప్రదేశ్,తేలంగాణ కర్ణాటకలలో ఆషాడమాసం వచ్చిందంటే.. కొత్తగా పెళ్లైన అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే పెళ్లికూతుళ్లను పుట్టింటికి పంపిస్తారు.
* కోడలు పుట్టింటికి ఎందుకు ?
కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు ఆషాడమాసంలో విడి విడిగా ఉండటానికి మరో కారణం ఉంది. ఆషాడ మాసంలో భార్యభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సయంలో గర్భం దాల్చడం వల్ల వేసవిలో ప్రసవం జరుగుతుంది. అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ వస్తాయని భావించని మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సంప్రదాయం తీసుకొచ్చారు.
* ప్రసవానికి ఇబ్బంది
ఎండాకాలంలో నార్మల్ డెలివరీ చాలా ఇబ్బందికరమైనది. అలాగే ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం హాస్పిటల్స్ లో మంచి ట్రీట్మెంట్ ఉండేది కాదు కాబట్టి.. ఇలా సంప్రదాయం పేరుతో భార్యాభర్తలను వేరుగా ఉంచేవాళ్లట.
* గోరింటాకు
ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఆషాడం సమయంలో వాతావరణం మారుతుంది. ఈ క్లైమెట్ లో మార్పుల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా.. గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట.

______________________________________

ఆషాఢ మాస ప్రాముఖ్యత
పూర్వాషాడ నక్షత్రం లో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాడ మాసం గా చెప్పబడింది. ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. వర్షఋతువు కూడా ఈ మాసం లోనే ప్రారంభమవుతుంది. ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం , పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడం లో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు . ఆషాఢమాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఆషాడం మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఈ ఆయనం లో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది.
ఈ మాసం లోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ కూడా. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.
ఆషాడ శుద్ద విదియ నాడు పూరీ జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగ గా జరుపుతారు.
ఆషాడ సప్తమి ని భాను సప్తమి గా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలలు తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం ఘడియ విఘడియల తేడా లేకుండా సరిమనానం గా ఉంటాయి.
ఆషాడ శుద్ద ఏకాదశి ని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈరోజు నుండి చాతుర్మాస వ్రతంఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు.
ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతం లో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనం గా చెప్తారు( భోజనానికి వికృతి పదమే బోనం) . దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం లో ఈ పండుగ అత్యంత వైభవం గా జరుపుకొంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనం లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికలిగించే వ్యాదుల నుండి ఉపకరించేవి. ఈ సమయం లో ప్రకృతి లో జరిగే మార్పుల వలన అనారోగ్యాలపాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి.
ఆషాడం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలుల తో పుల్లచినుకులు పడే సమయం ఈ ఆషాడమాసమే. కాలువలోను, నదులలోను, ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల లోనికి వచ్చి చేరిన నీరు మలినం గా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసం లోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయం లోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి , ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన యువకులు ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలం లో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి. ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయం లో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యం తో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి . అల్లుడు అత్తవారింటికి వెళ్ళ కూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ద్యాస తో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు. అంతే కాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తల నొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్దం చేసారు మన పెద్దలు.
ఈ ఆషాఢ మాసం విశేషం ఏమిటి?
శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా … ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసరించే మాసం “ఆషాడమాసం” చాంద్రమానం ప్రకారం “ఆషాడమాసం” నాలుగవ నెల. ఈ మసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలోగానీ, ఉత్తరాషాఢ నక్షత్రం సమీపంలోగానీ సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి “ఆషాఢ మాసం” అనే పేరు ఏర్పడింది. రోజూ కాకపోయినా ఆషాఢ మాసంలో
ఆషాడ శుద్ద పంచమి స్కంధ పంచమి గా చెప్తారు.
సుబ్రమణ్య స్వామి ని ఈ రోజు అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఆషాడ షష్ఠి ని కుమార షష్ఠి గా జరుపుకొంటారు
శుక్లపక్ష షష్టినాడు శ్రీసుబ్రహ్మణ్యసామి వారిని పూజించి కేవలం నీటిని మాత్రమే స్వీకరించి కఠిన ఉపవాసం ఉండి మరునాడు స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయని చెప్పబడుతుంది.
ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు. అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది. ఆషాఢ మాసంలో మహిళలు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి.ఆషాఢంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలువుతుంది.
కాగా ఆషాఢమాసం అనగానే గుర్తుకువచ్చే విషయం వివాహమైన తరువాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే విషయం. అంటే పెళ్ళయిన తొలి ఆషాఢ మాసంలో అతాకోడళ్ళూ ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్ధం. కాని సామాజికంగ ,చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయనిపిస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసుంటే గర్భం ధరించి బిడ్డ పుట్టేవరకు చైత్ర,వైశాఖ మాసం వస్తుంది. ఎండాకాలం ప్రారంభం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు.
ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్పబడుతూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు ఉన్నాయి.
శుక్లపక్ష ఏకాదశి : తొలి ఏకాదశిpss
దీనికే ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూ పేరు. శ్రీ మహావిష్ణువు ఇ దినం ఒదలుకుని నాలుగునెలలపాటు పాల కడలిలో శేష శయ్యపై శయనించి యోగనిద్రలో ఉంటాడు. ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణూవు పూజించాలి. మరునాడు ద్వాదశినాడు తిరిగి శ్రీమహావిష్ణువును పూజించి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదములు స్వీకరించి అటుపిమ్మట భోజనం చేయవలెను. ఈ రోజు నుండే చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.
శుక్లపక్ష పూర్ణిమ : వ్యాసపూర్ణిమ/గురుపూర్ణిమ
శ్రీ వేదవ్యాసుల వారి జన్మదినంగా చెపబడుతూ ఉన్న ఈ రోజును వ్యాసుడిని, కృష్ణుడిని ,గురుపరంపరను పూజించాలని శాస్త్ర వచనం.
కృష్ణ పక్ష అమావాస్య : దీప పూజ
ఆషాఢమాసం చివరి రోజు అయిన అమావాస్యనాడు చెక్క మీద అలికి ముగ్గులు పెట్టి దీపపు స్తంభాలను వుంచి వెలిగించి పూలు, లడ్డులు సమర్పించవలెను. సాయంత్రం కూడా దీపం వెలిగించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *